టాలీవుడ్ ప్రముఖులు తలసానిని కలవడానికి కారణం ఏంటీ?

Tollywood Film Celebrates Meet Minister Talasani Srinivas

టాలీవుడ్ సినీ ప్రముఖులు దిల్ రాజు, త్రివిక్రమ్‌, రాధాకృష్ణ, రాధా కృష్ణ, దానయ్య ఇంకా పలువురు నేడు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి ని కలవడం జరిగింది.ఆయన తో చాలా సమయం మాట్లాడిన తర్వాత మీడియా ముందుకు వచ్చారు.

 Tollywood Film Celebrates Meet Minister Talasani Srinivas-TeluguStop.com

ఈ సందర్బంగా పలు విషయాలను వారు చర్చించారని తెలుస్తోంది.ఉన్నట్లుండి తెలంగాణ రాష్ట్ర మంత్రిని ఎందుకు వీళ్లు కలిశారు అనేది చాలా మందికి వస్తున్న డౌట్‌.

అసలు విషయం ఏంటీ అంటే కరోనా కొత్త వేరియంట్‌ నేపథ్యంలో కొందరు అపోహలు పుట్టిస్తున్నారు.కొత్త వేరియంట్‌ కారణంగా సినిమా థియేటర్ల పై ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 Tollywood Film Celebrates Meet Minister Talasani Srinivas-టాలీవుడ్ ప్రముఖులు తలసానిని కలవడానికి కారణం ఏంటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆంక్షలు విధించడం వల్ల పెద్ద సినిమాలు విడుదల వాయిదా పడుతాయని అంటున్నారు.ఈ ప్రచారం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతున్న నేపథ్యంలో మంత్రితో ఒక ప్రకటన చేయించేందుకు ప్రముఖులు వెళ్లడం జరిగింది.

మంత్రి మాట్లాడుతూ మీడియా సంస్థలు కొన్ని ప్రచారం చేస్తున్నట్లుగా తెలంగాణలో థియేటర్ల పై ఎలాంటి ఆంక్షలు లేవు.కనుక ప్రేక్షకులు ఎలాంటి ఆందోళన లేకుండా వెళ్లి సినిమా చూడవచ్చు అన్నాడు.

కరోనా కేసుల విషయంలో తెలంగాణ రాష్ట్రం కు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ఆందోళన లేదు.జాగ్రత్తలు తీసుకుని సినిమాకు వెళ్లి రావచ్చు అంటున్నారు.

Telugu Corona, Danayya, Dilraju, Tollywood, Omicron, Radha Krishna, Rajamouli, Theaters, Trivikram-Movie

ఇక అదనపు షో లు మరియు టికెట్ల రేట్ల విషయంలో కూడా మాట్లాడుతూ ఆ విషయమై త్వరలోనే చర్చలు జరిపి తుది నిర్ణయానికి వస్తామని చెప్పుకొచ్చాడు.మంత్రి తో కేవలం ఆ విషయమై ప్రకటన చేయించేందుకు అంత మంది వెళ్లారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఏది ఏమైనా.ఎలాంటి ప్రచారం జరిగినా కూడా ప్రేక్షకులు మాత్రం సినిమా బాగుంది అంటే థియేటర్ల వద్ద క్యూలు కట్టడం కామన్ అయ్యింది.ఈ విషయంలో మళ్లీ మళ్లీ ఎలాంటి ఆందోళన అక్కర్లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా జనాలకు హామీ ఇస్తున్నారు.

#Radha Krishna #Trivikram #Corona #Omicron #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube