మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలు అందరూ బేటీ అయ్యారు.ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి 8 గంటల వరకు వీరందరూ సమావేశం అయ్యి పలు విషయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
సినిమా ఇండస్ట్రీలో పలు సమస్యలపై స్పందిస్తూ తాజాగా సినీ పెద్దలు అందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం సినీ పెద్దలు అందరూ మెగాస్టార్ ఇంటిలో భేటీ ఈ క్రమంలోనే ఈ సమావేశంలో అక్కినేని నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ రవి ప్రసాద్ వంటి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలు గురించి ముచ్చటించినట్లు తెలుస్తోంది.

కరోనా ప్రభావం కారణంగా సినిమా పరిశ్రమలో సినీ కార్మికులు, థియేటర్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.అదేవిధంగా విద్యుత్ టారిఫ్, బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు వంటి సమస్యలపై చర్చించడం కోసం వీరందరూ సమావేశమైనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తే ఈ సమస్యల గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించబోతున్నట్లు తెలుస్తోంది.