టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత మృతి.. !  

tollywood, films producer, doraswamy raju, passesaway, Tollywood famous producer v doraswami raju died,annamaya producer - Telugu Annamaya Producer, Doraswamy Raju, Films Producer, Passesaway, Tollywood, Tollywood Famous Producer V Doraswami Raju Died

టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల నిర్మాత పంపిణీదారుడు వి.దొరస్వామి రాజు ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూసారు.

TeluguStop.com - Tollywood Famous Filmmaker Doraswami Raju Passes Away

ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించటంతో గత కొద్దిరోజులుగా బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.దీనికి తోడుగా సహకరించని వయస్సు కారణంగా సోమవారం ఉదయం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.
దొరస్వామి రాజు గారు నిర్మాతగా కాకుండా వీఎంసీ డిస్ట్రిబ్యూటర్‌గా పలు విజయవంతమైన చిత్రాలను పంపిణీ కూడా చేసారు.1978 లో ప్రారంభించిన ఈ సంస్ద ద్వారా దాదాపు 750 చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసారు.అదీగాక నిర్మాతగా సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, కిరాయిదాదా, అన్నమయ్య, సింహాద్రి, వెంగమాంబ, భలేపెళ్లాం వంటి సినిమాలను కూడా నిర్మించారు.

TeluguStop.com - టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత మృతి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

1990లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన 1994లో నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా పలు కీలక పదువుల్లోనూ కొనసాగారు.దొరస్వామి రాజుగారు నిర్మించిన అన్నమయ్య చిత్రం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిపోయిందన్న విషయం తెలిసిందే.ఇక ఈయన మరణ వార్త విన్న చిత్ర రంగ ప్రముఖులు పలువురు ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

#TollywoodFamous #Doraswamy Raju #Films Producer #Passesaway

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు