వరుడు చిత్ర హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..?

తెలుగులో వచ్చి రావడంతోనే హీరోయిన్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుని హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినటువంటి హీరోయిన్లలో బాలీవుడ్ బ్యూటీ “భానుశ్రీ మెహ్రా” ఒకరు.ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించిన “వరుడు” అనే చిత్రంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించింది.

 Tollywood Fadeout Heroine Bhanu Sri Mehra Movie Offers News-TeluguStop.com

కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈ అమ్మడిని ఎవరూ గుర్తించలేదు.

దీనికితోడు భానుశ్రీ మెహ్రా తన తదుపరి తెలుగు చిత్రాలలో నటించినటువంటి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆమెకంటూ చెప్పుకోవటానికి సరైన హిట్ లేక కొత్త సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో దాదాపుగా పూర్తిగా విఫలమైంది.

 Tollywood Fadeout Heroine Bhanu Sri Mehra Movie Offers News-వరుడు చిత్ర హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 దీంతో ఇక తమిళంలో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు “సింబా” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. అయితే ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఈ అమ్మడికి తీవ్ర నిరాశనే మిగిల్చింది.

దీంతో ప్రస్తుతం భానుశ్రీ మెహ్రా సినిమా అవకాశాలు లేక ఇంటి వద్దనే ఖాళీగా గడుపుతోంది.కాగా ఈ మధ్య భానుశ్రీ మెహ్రా హిందీ సీరియళ్లలో నటించేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం.

అయితే ఇటీవలే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ  నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో కొంత మేర బోల్డ్ తరహా పాత్రలో నటించేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ఆమెను సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం.

#Guna Shekar #StylishStar #Bhanu Sri Mehra #Varudu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు