ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోలుగా తమకంటు ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకున్న చాలామంది హీరోలు వరుస సినిమాలు చేశారు ఇక ఒకానొక సమయం లో వాళ్ల కి సరైన సక్సెస్ లు లేక వాళ్ల మార్కెట్ అనేది భారీగా డౌన్ అవ్వడంతో సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి.ఇక దాంతో వాళ్లు హీరోగా చేయలేక, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగలేక ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ ఔట్( Fade Out Actors ) అయిపోవాల్సిన అవసరమైతే వచ్చింది.
ఇక ఇలాంటి క్రమంలోనే హీరోలందరూ ఇప్పుడు రీ ఎంట్రి ఇస్తూ ఈ సినిమాల్లో బిజీ అయిపోతున్నారు.ఇక ’90స్ ‘ వెబ్ సిరీస్( 90s Web Series ) తో శివాజీ నటుడుగా మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు.ఇక రీఎంట్రీ లో అదరగొట్టిన శివాజీ ప్రస్తుతం చాలా సినిమాల్లో అవకాశాలను అంది పుచ్చుకున్నాడు.ఇక దాంతో పాటుగా వరుస సినిమాలను చేయాలని ఆసక్తితో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక శివాజీ( Shivaji ) తో పాటు ఒకప్పుడు మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మరొక హీరో ‘వడ్డే నవీన్ ‘( Vadde Naveen ) ఈయన రీ ఎంట్రి కోసం చాలామంది చాలా రకాలుగా ఎదురుచూస్తున్నారు.కానీ ఈయన మాత్రం ఎప్పుడు రీ ఎంట్రి ఇస్తాడు అనే దాని మీద క్లారిటీ అయితే లేదు.
ఇక ఒకప్పుడు లవర్ బాయ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తరుణ్( Tarun ) కూడా ప్రస్తుతం రీ ఎంట్రి ఇస్తే చూడాలని తన అభిమానులు ఇప్పటికీ కోరుకుంటున్నారు.కానీ ఆయన ఇప్పుడప్పుడే రీ ఎంట్రీ( Re Entry ) ఇచ్చే విధంగా కనిపించడం లేదు.ఇక వీళ్ళతో పాటుగా కొంతమంది సీనియర్ హీరో లు అయితే కరెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తే చూడాలని చాలా మంది ఆసక్తి ఎదురు చూస్తున్నారు.అయినప్పటికీ కొంతమంది రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, మరి కొంత మంది మాత్రం సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ లేక బిజినెస్ లు చేసుకుంటున్నారు…
.