ఈనెల 20న సీఎం జగన్ తో  సినీ ప్రముఖులు భేటీ.. చిరంజీవి నేతృత్వంలో సినీ సమస్యలపై చర్చ

ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి తో సినీ ప్రముఖులు భేటీకి ముహూర్తం ఖరారైంది.

 Tollywood Elders Meeting With Ap Cm Jagan On September 20 Under Chiranjeevi Leadership-TeluguStop.com

ఈ నెల 20న ప్రముఖ సినీ నటులు చిరంజీవి నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చించనున్నారు.

కరోనా నేపథ్యంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరనున్నారు.కోవిడ్ నేపథ్యంలో గత ఏడాది  మార్చి 23 నుంచి లాక్ డౌన్ విధించడంతో థియేటర్లు మూసేశారు.

 Tollywood Elders Meeting With Ap Cm Jagan On September 20 Under Chiranjeevi Leadership-ఈనెల 20న సీఎం జగన్ తో  సినీ ప్రముఖులు భేటీ.. చిరంజీవి నేతృత్వంలో సినీ సమస్యలపై చర్చ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా నిర్మాణం కూడా ఆగింది.తదనంతరం కోవిడ్ సడలింపులతో సినిమా షూటింగులు మొదలైనప్పటికీ అతకు ముందు ఉన్నంతగా భారీగా లేవు.

కొత్త సినిమాలు లేకపోవడం కొవ్వు ఆంక్షలు విధించగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం గా చెప్పడంతో ఏపీ లోను  థియేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.ఈ కాలంలోనే గతేడాది చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు వంటి  ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యను వివరించారు.

వీరి సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి థియేటర్ల విద్యుత్ చార్జీలు బకాయిలను మూడు నెలలకు రద్దు చేయడంతోపాటు మిగిలిన బకాయిలు వాయిదాల్లో చెల్లించుదుకు అనుమతించారు.ఇది ఇలా ఉన్న తరుణంలోనే కోవిడ్ రెండోదశ ఉద్ధృతి మరోసారి సినీ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది.

ఆంక్షలు సడలించిన తర్వాత కూడా థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది.పైగా ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లు పెంపు పై ఆంక్షలు విధించడంతో మల్టీప్లెక్స్ లు ఏ కేంద్రాల్లోనూ కొన్ని  థియేటర్ మినహా చాలా వరకు ధియేటర్లు తెరుచుకోలేదు.

Telugu Chiranjeevi, Corona Shootings, Dilraju, Exhibitors, Meeting With Ap Cm Jagan, Minister Perni Nani, Movie Ticket Rates, Nagarjuna, Rajamouli, September 20, Tollwood, Tollywood Elders-Movie

వీటన్నింటిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిచి వివరించేందుకు సినిమా ప్రముఖులు పలుమార్లు నిర్ణయించుకున్నప్పటికీ రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.గత నెలలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు.ఆయా సమస్యలపై చర్చించేందుకుు ముుఖ్యమంత్రిని కలవాలంటూ నాని కోరగా వారు అంగీకరించారు.ఈ నేపథ్యంలో నెల 20న సీఎంతో సమావేశానికి సమయం తీసుకున్నట్లు తెలిసింది.సినీ ప్రముఖులు సమావేశంతో సమస్యల పరిష్కారం పై ఎగ్జిబిటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సినిమా టిక్కెట్లు ఆన్ లైన్ టిక్కెట్ల బుకింగ్ ను ప్రభుత్వమే చేపట్టేందుకు ప్రత్యేక వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకు వస్తున్న తరుణంలో సీఎంతో సినీ ప్రముఖులు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

#MinisterPerni #MeetingWith #Dilraju #Tollwood #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు