కరోనా దెబ్బకు గడిచిన రెండేళ్లుగా సినిమా పరిశ్రమ తీవ్ర ఇబ్బందులకు గురైంది.సినిమా షూటింగులు, విడుదల అన్నీ ఆగిపోయాయి.
సినిమా కార్మికులు నానా అవస్థలు పడ్డారు.సినిమాలు విడుదల కాక నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారు.
కరోనా నెమ్మదిగా తగ్గడంతో సినిమాలు నెమ్మదిగా విడుదలయ్యాయి.థియేటర్లు మళ్లీ సందడిగా మారాయి.
కొన్ని పెద్ద సినిమాలు సైతం విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి.దీంతో మళ్లీ సినిమా పరిశ్రమ కళకళలాడుతుంది.
కరోనా సెకెండ్ వేవ్ తర్వాత విడుదలైన లవ్ స్టోరీతో పాటు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టాయి.దీంతో సమ్మర్ వరకు పలు సినిమాలు రిలీజ్ డేట్లు ప్రకటించాయి.
అయితే ఇదే సమయంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నెమ్మదిగా వ్యాపిస్తోంది.దీంతో మళ్లీ పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి.
జనాలు సినిమాలకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఆయా సినిమాలను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో చిన్న సినిమాలను ఆడించేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.అటు పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు.దీంతో మళ్లీ సినిమా పరిశ్రమలో కరోనా భయం అలుముకుంది.
సెకెండ్ వేవ్ తర్వాత సందడిగా మారిన థియేటర్లు మళ్లీ వెలవెలబోయే పరిస్థితి నెలకొంది.సంక్రాంతి బరిలో నిలిచిన బంగార్రాజు సినిమా మాత్రమే ఫర్వాలేదు అనిపించింది.
జనాలను కూడా థియేటర్లకు రప్పించింది.ఈ సినిమా కూడా కొన్ని సెంటర్లలో అంత ప్రభావం చూపించలేకపోయింది.
అయితే ప్రస్తుతం వస్తున్న కరోనా కొత్త వేరియంట్ ప్రభావం అంతగా ఉండదని పలువురు భావిస్తున్నారు.త్వరలోనే కేసులు తగ్గుముఖం పడతాయంటున్నారు.
మరికొద్ది రోజుల్లో కరోనా సమస్యలన్నీ తీరిపోతాయంటున్నారు.ఎప్పటిలాగే సినిమా పరిశ్రమ మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇదంతా జరగడానికి కనీసం రెండు మూడు నెలలు అయినా పట్టే అవకాశం ఉందంటున్నారు.