దుబాయ్ దావత్ లో జరిగిన ఆ తప్పు వల్లే టాలీవుడ్ కు డ్రగ్స్ ఉచ్చు బిగిసిందా ?

గతంలో టాలీవుడ్ ను అల్లకల్లోలం చేసిన డ్రగ్స్ వ్యవహారం.మళ్లీ సినీ తారలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

 Tollywood Drugs Case Latest Updates, Rana, Tollywood Drugs, Case, Rana Daggubati-TeluguStop.com

ఇంతకు ముందు రోజుకో సెలబ్రిటీని ఇంటరాగేషన్ చేసి ఎక్సైజ్ అధికారులు కేసు హీట్ పెంచగా.తాజాగా ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చిది ఈడీ.

డ్రగ్స్ వ్యవహారంలో మనిలాండరింగ్ జరిగిందనే కోణంలోనే విచారణ కొనసాగిస్తుంది.ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్ తో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను విచారించింది ఈడీ.తాజాగా రానాను ఇంటరాగేషన్ చేసింది ఈడీ.సినిమా సెలబ్రిటీల, డ్రగ్స్ డీలర్లకు మధ్య జరిగిన లావాదేవీల గురించి పక్క సమాచారం సేకరించే పనిలో పడింది.

గతంలో ఎక్సైజ్ అధికారుల దర్యాప్తుతో తేలిన వాస్తవాలతో మనీలాండరింగ్ అంశాలను వెలికి తీస్తున్నారు ఈడీ అధికారులు.తాజాగా ఇవాళ టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యాడు.

అటు ఈ కేసులో కీలక ముద్దాయి, డ్రగ్స్ సరఫరా చేసిన కెల్విన్. అప్రూవర్ గా మారాడు.

ఆయన ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగానే రానాను విచారించారు అధికారులు.అంతేకాదు.

కెల్విన్ ఎదురుగానే రానాను విచారణ కొనసాగింది.రానా నుంచి కూడా పలు కీలక వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం అందుతోంది.

ఇప్పటికే ముగ్గురు సభ్యుల ఈడీ టీమ్.రానాను విచారిస్తుంది.

రానాతో పాటు ఆడిటర్ సతీష్, అడ్వకేట్ హాజరయ్యారు.

Telugu Calvin, Calvin Approver, Puri Jagannath, Directorate, Rana, Rana Daggubat

ఈ సందర్భంగా తన లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్ మెంట్లను రానా అధికారులకు అందించాడు.ఈ డాటాను ఈడీ అధికారులు పరిశీలించారు.ఈ అకౌంట్ నుంచి జరిగిన అనుమానిత లావాదేవీల గురించి రానాను అధికారులు క్వశ్చన్ చేస్తున్నారు.

అంతేకాదు.పలువురు గుర్తు తెలియని వ్యక్తులకు ఈ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

అటు దుబాయ్ లో జరిగిన ఈవెంట్లలో రానా, కెల్విన్ మధ్య జరిగిన మనీ ట్రాన్స్ ఫర్స్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది.రానా నుంచి కీలక విషయాలను తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పలువురు సినీ తారలను ఈడీ ప్రశ్నించింది.మరికొందరిని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube