కెల్విన్ తో కలిపి నందు విచారణ.. డ్రగ్స్ కేసులో ఏం జరగనుంది?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా ఏ విధమైనటువంటి కలకలం సృష్టించిందో అందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసు కు సంబంధించినటువంటి మనీలాండరింగ్ విషయంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తమ విచారణను వేగవంతం చేశారు.

 Tollywood Drugs Case Ed Questions Actor Nandu, Tollywood Drugs Case, Nandu, Toll-TeluguStop.com

ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్ ను విచారించిన ఈడీ అధికారులు తాజాగా మంగళవారం నటుడు నందుని కూడా విచారించారు.షెడ్యూల్ ప్రకారం నందును ఈడీ అధికారులు ఈనెల 20వ తేదీ విచారించాల్సి ఉండగా కొన్ని అనుకోని కారణాల వల్ల దానిని ముందుగానే అధికారులు విచారించారు.

ఈ సందర్భంగా ఈడీ అధికారులు ముందుకు వచ్చిన నందును సుమారు ఏడు గంటలపాటు విచారణ సాగిస్తూ క్రాస్ ఎగ్జామినేషన్‌కు తెర తీశారు.ఈ క్రమంలోనే నందును విచారిస్తున్న తరుణంలోనే డ్రగ్స్ ప్రధాన నిందితుడు కెల్విన్ ను కూడా కేంద్ర బలగాల సమక్షంలో ఈడీ అధికారులు ముందుకు తీసుకువచ్చారు.

ఈ క్రమంలోనే నందు, కెల్విన్ ను విడివిడిగా విచారించిన అధికారులు ఆ తర్వాత వీరిద్దరిని కలిపి విచారించారు.

ఈ క్రమంలోనే నందుని విచారిస్తున్న అధికారులు అతనికి ఏవైనా సంబంధాలు ఉన్నాయా? డ్రగ్స్ కొనుగోలుకు డబ్బులు ఇచ్చారా? అన్న కోణంలో అధికారులు అనుమానిస్తూ విచారించగా నందు వాటిని కొట్టిపారేస్తూ తన బ్యాంక్ స్టేట్ మెంట్ పత్రాలను అధికారులకు సమర్పించారు.

Telugu Calvin, Charmi, Puri Jagannath, Directory, Hyderabad, Nandu, Rakul, Tolly

గతంలో వీరిద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్ ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించడంతో ప్రస్తుతం ఈ విషయంపై వీరిద్దరిని విచారించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే కెల్విన్ ఈవెంట్ మేనేజర్ కావడంతో అతనితో సంప్రదింపులు జరిపానుగాని డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని నందు అధికారులకు వెల్లడించారు.ఇలా నందును సుమారు ఏడు గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు కెల్విన్ ను మాత్రం రాత్రి 10 గంటల వరకు విచారించినట్లు తెలుస్తోంది.మనీలాండరింగ్ విషయంలో చిత్రపరిశ్రమకు చెందిన దాదాపు 30 మందికి సమన్లు జారీ చేసిన అధికారులు త్వరలోనే వారిని కూడా విచారిస్తారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube