టాలీవుడ్ డ్రీమ్ కాంబినేషన్.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమా.. ఎప్పుడు వస్తుందో?

Tollywood Dream Combination Mahesh Babu And Pawan Kalyan Movie When Is It Coming

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందించారు.ఇలా ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి అన్న తమ్ముడు పాత్రలలో ఎన్నో చిత్రాలలో నటించే విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.

 Tollywood Dream Combination Mahesh Babu And Pawan Kalyan Movie When Is It Coming-TeluguStop.com

అలాగే శోభన్ బాబు, కృష్ణ , వంటి వారు కూడా మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.ఇక వీరి తరువాత ఇలా మల్టీస్టారర్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాయి.

ఇకపోతే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు వెంకటేష్ కలిసి మల్టీస్టారర్ చిత్రంగా చేసినప్పటికీ వీరు జనరేషన్ గ్యాప్ లో ఉన్న హీరోలు నటించారు.

 Tollywood Dream Combination Mahesh Babu And Pawan Kalyan Movie When Is It Coming-టాలీవుడ్ డ్రీమ్ కాంబినేషన్.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమా.. ఎప్పుడు వస్తుందో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ చిరంజీవి, బాలకృష్ణ ,వెంకటేష్, నాగార్జున వంటి సమకాలికులతో నటించాలని చాలా మంది భావించారు.

కానీ వీరు మాత్రం అలాంటి మల్టీస్టారర్ చిత్రాల్లో నటించలేదు.ఒకవేళ ఈ నలుగురు హీరోలు కనుక ఏదైనా మల్టీస్టారర్ చిత్రాల్లో నటించి ఉంటే ఆ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా వెంకటేష్ మహేష్ బాబు మల్టీ స్టారర్ గా వచ్చారు.ఇక ఆ తర్వాత రాజమౌళి పుణ్యమా అంటూ బాహుబలి చిత్రంలో ఇద్దరు సమకాలిక హీరోలు నటించి విశేషమైన ఆదరణ దక్కించుకున్నారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలోనే అలాంటి భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ గా ఆర్ఆర్ఆర్ అనే సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది.చాలా కాలం తర్వాత ఇలా ఇద్దరూ సమానంగా క్రేజ్ ఉన్న హీరోలతో సినిమా తీయడంతో ఇటు ఎన్టీఆర్ అభిమానులకు, అటు రామ్ చరణ్ అభిమానులకు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇలా రాజమౌళి సినిమా ద్వారా మరోసారి ఆ క్రేజీ కాంబినేషన్లు తెరపై చూసే అవకాశాలు కల్పిస్తున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రేక్షకుల డ్రీమ్ కాంబినేషన్ గా ఉన్నటువంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ఒకటి.

సాధారణంగా ఇద్దరికీ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మామూలుగానే వీరి సినిమాలు విడుదలైతే ప్రేక్షకులు, అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ల ముందు సందడి చేస్తుంటారు.

అలాంటిది ఈ క్రేజీ కాంబినేషన్ తెరపై కనపడితే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పవచ్చు.బాక్స్ ఆఫీసు వద్ద డిజాస్టర్ ఎదుర్కొంటూనే వంద కోట్లమార్కెట్ చేయగలిగే సత్తా ఉన్న ఈ హీరోలు ఇద్దరు కలిసి ఒకే తెరపై సందడి చేస్తే ఆ సినిమా ఎలా ఉండబోతుందో మాటల్లో చెప్పలేము.అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు బయట ఏదైనా కార్యక్రమాలప్పుడు కలిసి కనిపిస్తుంటారు.కానీ వీరిద్దరూ కలిసి ఒకే తెరపై కలిసి నటించే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు.

అయితే ఇలా సమకాలికుల హీరోలను కలిపి సినిమా తెరకెక్కించే సత్తా కేవలం రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మాత్రమే ఉందని చెప్పవచ్చు.ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మధ్య ఈ విధమైనటువంటి బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తలుచుకుంటే వీరిద్దరిని ఒకే తెరపై చూపించడం పెద్ద కష్టమైన పని కాదు అని చెప్పవచ్చు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరపై మ్యాజిక్ ఎప్పుడు చేస్తారు ప్రేక్షకుల కల ఎప్పుడు నెరవేరుస్తారో తెలియాల్సి ఉంది.త్వరలోనే ఈ స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమా రావాలని అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చేస్తున్నారు.

#Heroes #Pawan Kalyan #Dream #Rajamouli #PawanKalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube