ఓ వైపు సినిమాలు, మరోవైపు వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్లు వీరే..!

సినీ ప్రపంచంలో రాణించాలంటే అంత ఆషామాషీ విషయం కాదు.సినిమా ఇండస్ట్రీ లో పని చేస్తున్న వ్యక్తులు ఎవరైనా తెలిసి ఉంటే అందులోనూ పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు అలాగే నటీనటులను పరిచయం ఉంటేనే వారితో కలిసి సినిమా అవకాశాలను పంచుకోవచ్చు.

 Tollywood Directors Who Are Earning Crores With Businesses , Tollywood, Business-TeluguStop.com

లేకపోతే సినిమా ఇండస్ట్రీలో రాణించలేరు.అయితే ఇది వరకు కాలంలో సినీ ప్రవేశం చేయాలంటే అంత సులువైన విషయం కానేకాదు.

వారి దగ్గర ఎంత మంచి కంటెంట్ ఉన్న అలాగే వారి టాలెంట్ అమోఘంగా ఉన్నా కానీ.కొంతమంది సినీ పెద్దలు వారిని తొక్కేసే వారిని చెప్పుకొనేవారు.

అయితే అదంతా ఇదివరకు కాలంలో.ప్రస్తుతం ఉన్న కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరి టాలెంట్ వారు నిరూపించుకుంటున్నారు.

దీంతో ఈ మధ్యకాలంలో కొత్త కొత్త డైరెక్టర్లు సినిమా ఇండస్ట్రీలో కనబడుతున్నారు.కొత్త డైరెక్టర్ ల వద్ద కంటెంట్ బాగుంది అంటే చాలు స్టార్ హీరోలు సైతం వారిని గైడ్ చేస్తూ సినిమాలు నిర్మించేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో అనేకమంది నూతన దర్శకులు పరిచయం అయ్యి మంచి విజయాలు సాధిస్తున్నారు.ఇక అసలు విషయంలోకి వెళితే.

మన టాలీవుడ్ పరిశ్రమలో కొందరు ప్రముఖ డైరెక్టర్లు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు బిజినెస్ వైపు అడుగులు వేస్తూ రెండు వైపులా డబ్బులు సంపాదిస్తున్నారు.

ఈ లిస్టులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు.

ఈయన సినిమారంగంలో డైరెక్టర్ గా రానిస్తూనే మరోవైపు కథలను రాస్తూ అలాగే బయట అనేక వ్యాపార సామ్రాజ్యాలను కొనసాగిస్తున్నాడు.పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం.అలాగే కొడుకు ఆకాష్ కోసం మరిన్ని సినిమా కథలను రాయడంలో ప్రస్తుతం ఆయన బిజీగా ఉన్నారు.ఇక ఈ లిస్టులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన డైరెక్టర్ పేరు సుకుమార్.

సుకుమార్ తన కెరియర్ లో మొదటగా మ్యాథ్స్ లెక్చరర్ గా పనిచేసిన సంగతి అందరికి తెలిసిందే.ఆ తర్వాత సినిమాలపై ఉన్న మక్కువతో ఆయన సినిమా ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యి అనేక సూపర్ డూపర్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు.

ఈయన కేవలం సినిమాలు డైరెక్షన్ చేయడం మాత్రమే కాకుండా రైటర్ గా కూడా మంచి పేరు తెచ్చుకొని సినిమా కథలను ఆయన వ్యాపారపరంగా ఉపయోగించుకుంటున్నారు.ఇలా సుకుమార్ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

Telugu Directors, Harish Shankar, Maruthi, Puri Jaganth, Sudheer Varma, Sukumar,

ఇక ఈ లిస్టులో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మారుతి కూడా చేరిపోతాడు.ఈయన కూడా కేవలం సినిమాలు చేయడం మాత్రమే కాకుండా కథలు రాయడంలో కూడా వైవిధ్యాన్ని చూపించి వాటిని తెరకెక్కించే క్రమంలో ఆయన రెండు చేతులా సంపాదిస్తున్నాడు.ఇలా మన టాలీవుడ్ పరిశ్రమలో సుధీర్ వర్మ, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, త్రివిక్రమ్ ఇలా అనేక మంది తెలుగు డైరెక్టర్లు వారి సినిమాలతో మాత్రమే కాకుండా బయట కూడా వ్యాపారాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube