ఛాన్సులు లేక డీలా పడిన వరుణ్ తేజ్ హీరోయిన్..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు అన్నీ ఉన్నా అదృష్టం కూడా ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే.అందం, అభినయం పుష్కలంగా ఉన్నా అవకాశాలు రాక టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు.

 Tollywood Directors Not Offering Roles For Mehreen, Continuous, F2 Movie, Kannad-TeluguStop.com

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో నానికి జోడీగా నటించి హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టారు మెహ్రీన్.ఆ సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకున్నా మెహ్రీన్ నటనకు మంచి పేరు వచ్చింది.

ఆ తరువాత మెహ్రీన్ నటించిన మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి.కెరీర్ మొదట్లో వరుస విజయాలు అందుకున్న మెహ్రీన్ కు గత కొంతకాలంగా సరైన హిట్ దక్కడం లేదు.

గతేడాది ఎఫ్ 2 సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా నటించిన మెహ్రీన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నా ఆ సినిమాలో ఆమెది పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో గుర్తింపు రాలేదు.మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన కేరాఫ్ సూర్య, జవాన్, పంతం, ఎంత మంచివాడవురా, చాణక్య, కవచం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణ ఫలితాన్ని అందుకున్నాయి.

Telugu Flops, Kannada, Mehreen-Movie

వరుస ఫ్లాపుల వల్ల ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉన్నా అటు స్టార్ హీరోలు, ఇటు మిడిల్ రేంజ్ హీరోలు మెహ్రీన్ కు అవకాశాలు ఇవ్వడం లేదు.రష్మిక, పూజా హెగ్డే, కియారా అద్వానీ లాంటి హీరోయిన్లు వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటుంటే మెహ్రీన్ కు మాత్రం కొత్త అవకాశాలు ఇచ్చే దర్శకనిర్మాతలే కరువయ్యారు.ప్రస్తుతం శాండిల్ వుడ్ నుంచి మెహ్రీన్ కు ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.

2021 సంవత్సరం అయినా మెహ్రీన్ కు కలిసొస్తుందో లేదో చూడాల్సి ఉంది.

తమన్నా, కాజల్, అనుష్క లాంటి హీరోయిన్లు కెరీర్ మొదలుపెట్టి 15 సంవత్సరాలైనా అవకాశాలను అందిపుచ్చుకుంటుంటే మెహ్రీన్ మాత్రం అవకాశాలు రాక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube