అనౌన్స్ చేశారు.. అతీగతీ లేదు.. టాప్ దర్శకుల డ్రీమ్ ప్రాజెక్టులు కలలుగానే మిగలనున్నాయా?

ప్రతి డైరెక్టర్ కి ఓ డ్రీమ్ ప్రాజెక్టు ఉంటుంది.కొంతమంది ఫిల్మ్ మేకర్స్ మాత్రమే వారి డ్రీమ్ ను తెరపై ఆవిష్కరిస్తారు.

 Tollywood Directors Dream Projects-TeluguStop.com

చాలా మంది పలు కారణాలతో తమ చిరకాల కోరికలకు బ్రేకులు వేస్తారు.వాళ్లు తమ జీవితంలో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్లు సాధించినా.

తమ డ్రీమ్ ప్రాజెక్టు మాత్రం మదిలో మెదులుతూనే ఉంటుంది.మన తెలుగు సినిమా దర్శకుల డ్రీమ్ ప్రాజెక్టులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

 Tollywood Directors Dream Projects-అనౌన్స్ చేశారు.. అతీగతీ లేదు.. టాప్ దర్శకుల డ్రీమ్ ప్రాజెక్టులు కలలుగానే మిగలనున్నాయా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

క్రిష్ణ వంశీ- రుద్రాక్ష‌

క్రిష్ణవంశీ తన దర్శకత్వంలో రుద్రాక్ష‌ సినిమా చేయాలనుకున్నాడు.రమ్యక్రిష్ణ, అనుష్క, సమంతతో ఈ మూవీ ప్లాన్ చేశాడు.కానీ బడ్జెట్ అంచనాలను మించడంతో సినిమా ఫైనలైజ్ కాలేదు.

రాజమౌళి-మహాభారతం

మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్టు అని రాజమౌళి చాలా సార్లు చెప్పాడు.కానీ ఈ సినిమా ఎప్పుడు తెరకు ఎక్కుతుంది అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.

పవన్ కల్యాణ్-సత్యాగ్రహి

పవన్ కల్యాణ్ రాసుకున్న కథ ఇది.రాజకీయ నేపథ్యం ఉన్న ఈ సినిమాలో తను విద్యార్థి నాయకుడిగా కనిపించాలి అనుకున్నారు.కానీ అడుగు ముందుకు పడలేదు.

గుణశేఖర్-హిరణ్య కశప

గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్టు హిరణ్య కశప.రానా హీరోగా ఈ సినిమా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.కారణాలు ఏంటో తెలియదు కానీ.షూటింగ్ మాత్రం మొదలు కాలేదు.

క్రిష్ణ వంశీ-రైతు

బాలయ్య హీరోగా క్రిష్ణ వంశీ రైతు అనే సినిమా చేయాలి అనుకున్నాడు.ఈ కథ కూడా బాలయ్యకు నచ్చింది.కానీ ఒక పాత్రలో అమితాబ్ బచ్చన్ చేస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెప్పాడు.బిగ్ బీని అడిగినా పలు కారణాలతో ఆయన చేయలేను అని చెప్పాడు.ఆ ప్రాజెక్టు అలాగే ఆగిపోయింది.

పూరీ జగన్నాథ్-జనగనమన

మహేష్ తో పలు సూపర్ హిట్ సినిమాలు చేసిన పూరీ.మరో డ్రీమ్ ప్రాజెక్టు చేయాలి అనుకున్నాడు.అదే జనగనమన మూవీ.చాలా రోజులుగా ఈ సినిమా గురించి టాక్ నడుస్తున్నా ప్రకటన మాత్రం రాలేదు.

త్రివిక్రమ్-కోబలి

పవన్ కల్యాణ్ తో కలిసి ఈ సినిమా చేస్తానని త్రివిక్రమ్ చెప్పాడు.ఈ సినిమా తప్ప అన్నీ చేస్తున్నాడు.ఎందుకు ఈ సినిమాను సీరియస్ గా తీసుకోవడం లేదనేది తెలియాల్సి ఉంది.

సుకుమార్-మత్స్యకారుల మూవీ

శ్రీలంక నుంచి బయల్దేరి తిండిలేక తిప్పలు పడుతూ తూర్పు గోదావరికి చేరుకున్న మత్స్యకారుల కథను తీయాలని ఉందన్నాడు.కానీ మార్కెట్ వస్తుందా అనే భయంతో చేయడం లేదని చెప్పాడు.

క్రిష్-పర్వ

కన్నడ రచయిత బైరప్పప రాసిన పర్వ కథను తెరకెక్కించాలి అనుకుంటున్నాడు దర్శకుడు క్రిష్.ఇది మహాభారతం బేస్ గా ఉంటుంది.

ఆర్జీవీ- డీ కంపెనీ

ఇప్పటికే ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్టు అని చాలా సార్లు చెప్పాడు ఆర్జీవి.అయినా అడుగు ముందుకు పడలేదు.

#PawanKalyan #SukumarDream #TollywoodTop #Rajamouli #DirectorsDream

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు