చిరంజీవితో సినిమా తీసిన పాపానికి కెరీర్ కోల్పోయిన స్టార్ డైరెక్టర్స్ వీళ్ళే !

మెగాస్టార్ చిరంజీవి… ఈ పేరు చెప్తే ఎంతోమంది పులకించిపోతారు.తమ ఆదర్శ హీరో అంటూ ఆరాధిస్తూ ఉంటారు.

 Tollywood Directors Career After Chiranjeevi Movies Koratala Vv Vinayak Surender-TeluguStop.com

చిరంజీవిని చూసే సినిమాలోకి వచ్చామని చెప్పే హీరోలు ఎంతోమంది ఉంటారు.సాధారణ కానిస్టేబుల్ కుటుంబంలో జన్మించిన చిరంజీవి నేడు టాలీవుడ్ లో మెగాస్టార్ గా రాణిస్తున్నారు అంటే దానికి పూర్తిగా అతడు నమ్ముకున్న కష్టం అనే చెప్పాలి.

ఎన్నో అవమానాలు, ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డాడు.అంతే కాదు చిరంజీవి చాలామంది దర్శకులకి లైఫ్ కూడా ఇచ్చాడు ఎంతో మందిని తెలుగు తెరకు పరిచయం కూడా చేశాడు.

తొలుత చిన్న హీరోగా, విలన్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ ఆ తర్వాత కాలంలో సూపర్ బ్లాక్ బాస్టర్స్ ఇచ్చి సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారాడు.మరి అలాంటి చిరంజీవి రాజకీయాలపై మక్కువతో పదేళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు.

కానీ రీఎంట్రీ ఇచ్చి మళ్ళి హిట్ కొట్టినప్పటికీ ఆ తర్వాత మెగాస్టార్ తో సినిమాలు తీస్తున్న దర్శకులకి అదే శాపంగా మారింది అని చెప్పాలి.అలా చిరంజీవితో సినిమాలు తీయడం వల్లే కెరియర్ పోగొట్టుకుంటున్న ఆదర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

వివి వినాయక్

చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150.ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించగా ఈ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.వివి వినాయక్ సైతం తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలో తీశాడు.కానీ ఈ సినిమా తర్వాత వినాయక్ రేంజ్ అమాంతం పడిపోయింది.ప్రస్తుతం వినాయక చేతిలో అవకాశాలు లేవు.

సురేందర్ రెడ్డి

సైరా నరసింహారెడ్డి వంటి సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ఈ సినిమాలో చిరంజీవి నటించిన ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు.తెలుగులో పర్వాలేదనిపించింది కానీ ఇతర భాషలో మాత్రం కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.ప్రస్తుతం సురేందర్ రెడ్డి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది ఈ సినిమా తర్వాత.

కొరటాల శివ

చిరంజీవితో ఆచార్య వంటి సినిమా తీశాడు కొరటాల శివ.ఈ సినిమా దారుణమైన పరాజాయాన్ని మూట కట్టుకుని అసలు ఫ్లాప్స్ అంటే ఏంటో కూడా చివరికి ఆచార్య ఎంతో నిరాశని కలిగించింది.ఈ సినిమా ద్వారా అనేక అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.ఈ సినిమా తర్వాత ప్రస్తుతం కొటాల శివ పేరు చెబితే టాలీవుడ్ లో హీరోలంతా భయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube