తండ్రులకు తగ్గ తనయలు అనిపించుకుంటున్న 7 టాలీవుడ్ డైరెక్టర్స్ డాటర్స్

ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలంటే అది డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది.ఎందుకంటే కథ, కథనం, ఆర్టిస్టుల నుండి ఆయనకు తగ్గట్టు యాక్టింగ్ చేయించుకోవడం.

 Tollywood Directors And Their Daughters-TeluguStop.com

సినిమా విడుదలయ్యే వరకు నిర్మాతని ఎక్కడ హర్ట్ చేయకుండా జూనియర్ ఆర్టిస్టుల నుండి హీరో హీరోయిన్ వరకు ఆల్మోస్ట్ 24 క్రాఫ్ట్స్ ని మేనేజ్ చేసుకోవడం.ఇలా ఒక డైరెక్టర్ చేతిలోనే సినిమా మొత్తం ఆధారపడి ఉంటుంది.

అందుకే డైరెక్టర్ ని కెప్టెన్ అఫ్ ది షిప్ అని అంటుంటారు.అయితే మన తెలుగు సినిమాకి అద్భుతమైన డైరెక్టర్స్ దొరికారు.

 Tollywood Directors And Their Daughters-తండ్రులకు తగ్గ తనయలు అనిపించుకుంటున్న 7 టాలీవుడ్ డైరెక్టర్స్ డాటర్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మన తెలుగులో టాప్ లో ఉన్న డైరెక్టర్స్ ఎవరో మనందరికి తెలిసిందే.అయితే ఆ డైరెక్టర్స్ కూతుర్లు ఇప్పుడేం చేస్తున్నారో తెలిస్తే మనమంతా షాక్ అవుతాం ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని ఇట్టే తెలిసిపోతున్నాయి.సో, ఇప్పుడు మనం టాప్ డైరెక్టర్స్ కూతుర్లు ఇప్పుడేం ఏం చేస్తున్నారో చూద్దాం.

గుణశేఖర్ కూతురు నీలిమ

డైరెక్టర్ గుణశేఖర్ గారికి ఇద్దరు కుమార్తెలు.వీళ్లిద్దరు కూడా తండ్రి బాటలోనే సినిమా ఇండస్ట్రీలోనే సెట్టిల్ అవ్వాలని చూస్తున్నారు.అనుష్క నటించిన రుద్రమ దేవి చిత్రానికి గుణశేఖర్ పెద్ద కూతురు నీలిమ నిర్మాతగా వ్యవహరిస్తే.

చిన్నకూతురు కూడా ఇవాళో రేపో సినీ పరిశ్రమలోనే ఏదొక విభాగంలో పనిచేస్తారని తెలుస్తోంది .

Telugu Gunashekar, Maruthi, Purijagannath Daughter, Sukumar, Teja, Vamsi Paidipalli-Telugu Stop Exclusive Top Stories

పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర

మన తెలుగు సినిమా పరిశ్రమలో దమ్మున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది పూరి గారే.ఈ విషయం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.ఒక సినిమాని ఎంత సింపుల్ గా తీయొచ్చు, అసలు ఒక ఆడియన్ కి ఏం కావాలి.

ఎలా తీస్తే మన సినిమాని ప్రేక్షకులు ఇష్టపడతారు.లాంటి విషయాల్లో పూరి గారు తోపనే చెప్పాలి.

అయితే ఈయన ముద్దులు కూతురు పేరు పవిత్ర..

ఈమె కూడా సినిమాల్లోకి రావాలనే ప్రయత్నిస్తుంది.అయితే యాక్టర్ గా కాదట పూరి వారసురాలిగా డైరెక్షన్ చేయాలనేది పవిత్ర ఆశయం అట.సో, త్వరలోనే ఆమె ఒక మంచి కథతో డైరెక్టర్ గా అరంగేట్రం చేయాలనీ ప్రయత్నాలు చేస్తోంది.ఇకపోతే పూరి కొడుకు ఆకాష్ ఇప్పటికే హీరోగా అడుగుపెట్టిన విషయం మనందరికి తెలియందే.

ఇక పూరి కూతురు పవిత్ర కూడా బుజ్జిగాడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది.

Telugu Gunashekar, Maruthi, Purijagannath Daughter, Sukumar, Teja, Vamsi Paidipalli-Telugu Stop Exclusive Top Stories

రాజమౌళి కూతురు మయూఖ

తెలుగు సినిమా లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి గారి కూతురు మయూఖ కూడా కచ్చితంగా సినిమా ఇండస్ట్రీలోనే సెట్టిల్ అవ్వాలని చూస్తుందట.దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఇప్పటికే మొదలెట్టారని తెలుస్తోంది.

Telugu Gunashekar, Maruthi, Purijagannath Daughter, Sukumar, Teja, Vamsi Paidipalli-Telugu Stop Exclusive Top Stories

సుకుమార్ కూతురు సుకృతి వేణి

ఇక డైరెక్టర్ సుకుమార్ గారి గురించి చెప్పేదేముంది ఆర్య సినిమా నుండి ఆయన సినిమాలను గమనిస్తూనే ఉన్నాం.ప్రతి సినిమాకి ఏదొక కొత్త కోణాన్ని మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడంలో సుకుమార్ గారు కూడా తోపే.అయితే ఇప్పుడు ఆయన కూతురు కూడా తండ్రి ఇమేజ్ ని మరింత పెంచబోతోంది.

ఎలా అంటే ఆమెకున్న సింగింగ్ టాలెంట్ ద్వారా.ఈమె urban jam with సుకృతి అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది.

దీనిలో ఇప్పటికైతే మ్యూజిక్ వీడియోస్ చేస్తోంది.అంతేకాదు సుకుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఒక పాటని విడుదల చేసి తన తండ్రికి అంకితం ఇచ్చింది.

Telugu Gunashekar, Maruthi, Purijagannath Daughter, Sukumar, Teja, Vamsi Paidipalli-Telugu Stop Exclusive Top Stories

తేజ కూతురు ఐలా

దర్శకుడు తేజ గారి గురించి మనందరికి తెలిసిందే.ఆయన మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.ఇప్పుడు తన కొడుకు ని హీరో గా పరిచయం చేసే పనిలో ఉన్నారు.ఇక కూతురు విషయానికి వస్తే.ఆయన కూతురి పేరు ఐలా.ఈమె ప్రెసెంట్ అమెరికాలో haas school of business ఆఫ్ berkeley లో మాస్టర్స్ చదువుతుంది.అలా చదువుకుంటూనే తాను ఒక మంచి స్పీకర్ గా కూడా అమెరికాలో మంచి ఫాలోయింగ్ సంపాదిస్తుందట.అమెరికా లో బెర్కిలీ ఫోరమ్ తరపున పలు కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తుంది.

అంతేకాదు యువత మేల్కోవాలని వారి కొచ్చిన ప్రతి ఐడియాస్ ని వ్యాపార దిశలో అభివృద్ధి చేసుకోవలసిందిగా స్పీచెస్ ఇస్తుందట.సో, తేజగారి కూతురు ఫ్యూచర్ లో బిజినెస్ వుమన్ గానే కాకుండా మంచి స్పీకర్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Telugu Gunashekar, Maruthi, Purijagannath Daughter, Sukumar, Teja, Vamsi Paidipalli-Telugu Stop Exclusive Top Stories

మారుతి కూతురు హియా

Telugu Gunashekar, Maruthi, Purijagannath Daughter, Sukumar, Teja, Vamsi Paidipalli-Telugu Stop Exclusive Top Stories

ఎటువంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన దర్శకుడు మారుతి గారు తన కూతురిని కూడా ప్రతి రోజు పండగే సినిమా ద్వారా ఒక నటిగా పరిచయం చేసాడు.అంతేకాదు హిమా త్వరలోనే పూరి స్థాయి నటీమణిగా మారుతుందట.ఆమెకి అంత ఇంట్రెస్ట్ సినిమా అంటే….

 వంశి పైడిపల్లి కూతురు ఆద్య

Telugu Gunashekar, Maruthi, Purijagannath Daughter, Sukumar, Teja, Vamsi Paidipalli-Telugu Stop Exclusive Top Stories

మీకు ఆధ్య అండ్ సితార అనే యూట్యూబ్ ఛానల్ తెలుసా.అందులో ఇద్దరమ్మాయిలు వాలా టాలెంట్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు.అందులో మహేష్ బాబు గారాల కూతురు సితార ఒకరు అయితే వంశి పైడిపల్లి కూతురు ఆద్య ఒకరు.

సో, మహేష్ బాబు వారసురాలు సితారతో కలిసి తనలో ఉన్న టాలెంట్ ని సోషల్ మీడియా ద్వారా ప్రెసెంట్ చేసుకుంటోంది ఆధ్య.

#Sukumar #Teja #Maruthi #Gunashekar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు