సినిమాకు డైరెక్టర్ అనే వాడు హార్ట్.తన అద్భుత ఆలోచనలతో చక్కటి సినిమాలను తెరకెక్కిస్తాడు దర్శకుడు.
హాలీవుడ్ డైరెక్టర్లు తమ జీవిత కాలంలో వేళ్ల మీద లెక్కపెట్టేన్ని చిత్రాలను మాత్రమే రూపొందిస్తారు.ఒక సినిమాలో వాడిన క్యారెక్టర్స్‌ను మళ్లీ రిపీట్ చేయకుండా ఉండేలా జాగ్రత్త పడతారు.
బాలీవుడ్లో ఈ సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది.ఇక టాలీవుడ్ వరకు వచ్చే సరికి ఈ పరిస్థితి చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
ప్రతి డైరెక్టర్ మూస ధోరణిలోనే ఉంటాడు.టాలీవుడ్ నుంచి ఇండియన్ టాప్ డైరెక్టర్‌గా ఎదిగిన ఎస్ఎస్ రాజమౌళి సైతం ఇందుకు మినహాయింపు ఏమీ కాదు.
తెలుగు డైరెక్టర్లు.వాళ్ల క్యారెక్టరైజేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
1.కొరటాల శివ

ఈయన దర్శకత్వంలో కేవలం నాలుగంటే నాలుగే సినిమాలు తెరకెక్కాయి.టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.ఈయన సినిమాలు సైతం సేమ్ క్యారెక్టర్‌ను రిపీట్ చేస్తుంటాయి.హీరో మాటలు తక్కువ.చేతలు ఎక్కువగా చూపిస్తాడు.మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల్లోని హీరో క్యారెక్టర్లన్నీ ఒకే లక్షణాన్ని కలిగి ఉంటాయి.
కామెడీ లేని. సొషల్ కాజ్‌కోసం కొట్లాడే తత్త్వమే ఈయన సినిమాల్లో ప్రతిబింబిస్తుంది.
2.బోయపాటి శ్రీను

బోయపాటి శ్రీను అనగానే రక్తసిక్తమైన వెండి తెరే గుర్తుకొస్తుంది.ఈయన సినిమాల్లో రక్తం ఏరులైపారుతుంది.మాస్ క్యారెక్టర్.
విపరీతమైన మరణాయుధాల వాడకం, విలన్స్ కారణంగా హీరోయిన్స్ కష్టాలు, విలన్ నుంచి హీరోయిన్ను రక్షించే హీరో.ఇవే ఈయన సినిమా కథా వస్తువులు.సినిమా మొదలు కొని ఎండింగ్ వరకు హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది సినిమా.
4.వీవీ వినాయక్

కమర్షియల్ సినిమాల రారాజు వీవీ వినాయక్.ఈయన ఆలోచనలు సైతం కొన్ని పాత్రల చుట్టూనే తిరుగుతుంటాయి.విలన్స్‌తో జోకులు చేయించడం, ప్రతి సినిమాలోనూ ఫ్లాష్ బ్యాక్ సీన్లు పెట్టడం, డ్యూయెల్ క్యారెక్టర్లు రూపొందంచడం ఈయన నైజం.తను దర్శకత్వం వహించిన 90 శాతం సినిమాల్లో ఇదే ఫార్ములాను వర్కవుట్ చేశాడు వినాయక్.
5.ఎస్ఎస్ రాజమౌళి

టాలీవుడ్లో అపజయం ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి.తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ మూవీసే.బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన మొనగాడు.
అయినా తన సినిమాల్లో ఓ మూస విధానాన్ని పాటిస్తాడు.ప్రతి సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్‌తో తదుపరి పార్ట్‌పై విపరీతమైన ఆసక్తిని కలిగిస్తాడు.
ఆయన ప్రతి మూవీలోనూ పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ ఉంటుంది.సినిమాను తెరకెక్కించే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తాడు రాజమౌళి.ఆయన జాగ్రత్తలే సినిమాలను బంఫర్ హిట్ జాబితాలో నిలుపుతున్నాయి.
6.శ్రీను వైట్ల

ప్రస్తుతం డౌన్ ఫాల్లో కొనసాగుతున్న శ్రీను వైట్ల.ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన డైరెక్టర్.తాను ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించాడు.ఈయన కూడా కొన్ని క్యారెక్టర్లను మళ్లీ మళ్లీ రిపీట్ చేసేవాడు.ఆయన సినిమాల్లో ఎక్కువ కామెడీ ఉంటుంది.అదీ చౌకబారు స్థాయిలో ఉంటుంది.
ఒక్కోసారి ఈ కామెడీ గట్టి దెబ్బేసిన ఘటనలూ ఉన్నాయి.ఈయన సినిమాల పేర్లు కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి.
సినిమాల్లో క్యారెక్టర్ల పేర్లు కూడా వినడానికి కాస్త కామెడీగా ఉంటాయి.ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రాంతాల యాసలు ఈయన సినిమాల్లో కనిపిస్తాయి.
7.గౌతమ్ మీనన్

తమిళ దర్శకుడు గౌతమ్ మ పలు సక్సెస్ చిత్రాలను తెరకెక్కించాడు.కొన్ని తెలుగు స్ట్రెయిట్ సినిమాలను సైతం రూపొందించాడు.ఈయన సినిమాల్లోనూ కొన్ని క్యారెక్టర్లు రిపీట్ అవుతుంటాయి.
ముందుగా ఈయన హీరోయిన్ ఓరియెంటెడ్ డైరెక్టర్.హీరోయిన్ స్వతంత్ర భావాలు కలిగి ఉండేలా చూస్తాడు.
లవ్ సినిమాలకు ఎక్కువ ప్రధాన్యత ఇస్తాడు.సినిమాలు రియలిస్టిక్ ఉండేలా చూసుకుంటాడు.ప్రతి సీన్లోనూ ప్రేక్షకుడు ఫీలయ్యేలా చేస్తాడు గౌతమ్.
8.సుకుమార్

టాలీవుడ్లో మోస్ట్ టాలెండెట్ డైరెక్టర్ సుకుమార్.ఈయన సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా క్రిటికల్‌గా ఉంటాయి.మాంచి మసాలా సాంగ్స్ ఉంటాయి.హీరో క్యారెక్టర్ డిసేబుల్‌గా ఉంటుంది.లేదంటే ఇగోయిస్ట్‌గా ఉంటాడు.
9.పూరీ జగన్నాథ్

పూరీ జగన్నాథ్ సినిమాలో హీరోయిజం బలంగా ఉంటుంది.హీరోలను ఏ క్యారెక్టర్లోనైనా ఒదిగిపోయేలా చేస్తాడు.క్లాస్ హీరోలను కూడా మాస్ లుక్‌లో చూపించగలడు.హీరో లాంగ్వేజ్ డిఫరెంట్‌గా ఉండేలా చూస్తాడు.సమాజంపై తన కోపాన్నంతా చూపిస్తాడు పూరీ.మంచి ఊపున్న డైలాగ్స్ ఈయన సినిమాలో మస్తు కనిపిస్తాయి.
10.త్రివిక్రమ్

మంచి మాటల రచయితగా పేరొంది డైరెక్టర్‌గా రూపాంతరం చెందిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్.ఈయన మార్క్ డైలాగులతో సినిమా జోరుగా కొనసాగుతుంది.క్లాసీ హీరోయిజం.
సూపర్ కామెడీ రొటీన్ అంశాలు.ఈయన సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా పనుండదనే చెప్పాలి.