టాలీవుడ్‌ను వ‌ణికిస్తున్న‌ క‌రోనా.. డైరెక్ట‌ర్‌ తేజకు పాజిటివ్‌!!  

చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా.ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ప్ర‌పంచ‌దేశాల‌కు కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా.ఎప్పుడు ఎలా కాటేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు క్ష‌ణ‌క్ష‌ణం భ‌యంతో వ‌ణికిపోతున్నారు.ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసే వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో.దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక ప్ర‌పంచ‌దేశాలు గందరగోళంలో పడిపోయాయి.

TeluguStop.com - Tollywood Director Teja Tests Corona Positive

మ‌రోవైపు ఈ ప్రాణాంత‌క క‌రోనా సామాన్యుల‌తో పాటు రాజకీయ నాయ‌కులు, సినీ, క్రీడా సెల‌బ్రిటీలకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.ఇక ప్ర‌స్తుతం టాలీవుడ్‌ను వ‌ణికిస్తోంది క‌రోనా.ఇప్ప‌టికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో బండ్ల గణేష్, సమంత స్నేహితురాలు, నటుడు సామ్రాట్ సోదరి శిల్పారెడ్డి త‌దిత‌రులు క‌రోనా బారిన ప‌డ్డారు.

అలాగే గ‌త వారం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి మ‌రియు ఆయన కుటుంబ స‌భ్యుల‌కు కూడా కరోనా సోకింది.ఇక తాజాగా మ‌రో టాలీవుడ్ డైరెక్ట‌ర్ తేజకు క‌రోనా పాజిటివ్‌గా తేలింది.గ‌త వారం ఈయ‌న‌ ఓ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ముంబైకి వెళ్లొచ్చాడు.అక్కడే కరోనా వైరస్ సోకుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

TeluguStop.com - టాలీవుడ్‌ను వ‌ణికిస్తున్న‌ క‌రోనా.. డైరెక్ట‌ర్‌ తేజకు పాజిటివ్‌-Movie-Telugu Tollywood Photo Image

మ‌రోవైపు తేజతో ప‌ని చేసిన యూనిట్ సబ్యులకు, కుటుంబ సభ్యులందరికి కరోనా టెస్టులు చేశారు.

అయితే ఈ రిపోర్టుల్లో తేజ‌కు త‌ప్ప మిగ‌తావారంద‌రికీ నెగిటివ్ వ‌చ్చింది.దాంతో ఆయన కాస్త ఊపిరి పీల్చుకున్నాడు.

ఇక ప్ర‌స్తుతం తేజ హోమ్ ఐసోలేష‌న్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

#Corona Positive #Coronavirus #COVID-19 #Director Teja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Director Teja Tests Corona Positive Related Telugu News,Photos/Pics,Images..