పుష్ప 2 కోసం భారీగా పారితోషికం తీసుకుంటున్న సుకుమార్.. ఎంతంటే?

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,రష్మిక మందన కలిసి నటించిన పుష్ప సినిమా విడుదల అయ్యే ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా ఒకే విధంగా హిట్ టాక్ ని తెచ్చుకుంది.

 Director Sukumar Remuneration For Pushpa2,pushpa2,allu Arjun,rashmika Mandanna, Director Sukumar-TeluguStop.com

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన విషయం తెలిసిందే.అయితే మొదట్లో ఈ సినిమా విడుదలైన తర్వాత నెగిటివ్గా టాక్ వినిపించినప్పటికీ ఆ తర్వాత బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది.

పుష్ప 1 ఈ రేంజ్ లో హిట్ అవ్వడంతో ఇక పార్ట్ 2 అంతకుమించి ఉంటుంది అని అభిమానులు అంచనా వేస్తున్నారు.అంతేకాకుండా దర్శకనిర్మాతలు కూడా ఈ సినిమా పార్ట్ 2 కోసం మొదటి భాగం కంటే ఎక్కువగా పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 Director Sukumar Remuneration For Pushpa2,Pushpa2,Allu Arjun,Rashmika Mandanna, Director Sukumar-పుష్ప 2 కోసం భారీగా పారితోషికం తీసుకుంటున్న సుకుమార్.. ఎంతంటే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పార్ట్ 1కి మించి ఉండేవిధంగా ప్రేక్షకుల అంచనాలు మేరకు మరింత ప్రతిష్ఠాత్మకంగా పార్ట్ 2 ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.పుష్ప సినిమా విడుదల తర్వాత దర్శకుడు సుకుమార్ రేంజ్ అమాంతం పెరిగి పోయింది.

ఈ సినిమా కోసం సుకుమార్ దాదాపుగా 18 కోట్ల పారితోషికం తీసుకున్నారట.

అయితే పుష్ప కి సీక్వెల్ గా వస్తున్నా పార్ట్ 2 కి దాదాపుగా 40 కోట్ల రూపాయలను తన ఇంటికి తీసుకెళ్లి అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ ఇదే కనుక నిజమైతే భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న దర్శకుల జాబితాలో సుకుమార్ కూడా చేరినట్లే అని చెప్పవచ్చు.పుష్ప సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించడమే కాకుండా టెక్నికల్ పరంగా పెద్ద స్థాయిలో వర్కౌట్ అయింది.

ఇప్పుడు పుష్ప 2లో బన్నీని మరో లెవల్ యాక్షన్ స్టార్ గా ఆవిష్కరించనున్నారట.మొదటి భాగంలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ .శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో రష్మిక మందన క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube