మారుతీరావు చనిపోయిన రోజును ఫాదర్స్ డేగా ప్రకటించాలి.. డైరెక్టర్ వింత డిమాండ్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమృత తండ్రి, ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు శనివారం రోజున ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.నిన్న భారీ పోలీస్ బందోబస్త్ మధ్య మారుతీరావు అంత్యక్రియలు జరిగాయి.

 Tollywood Director Sairajesh Satirical Post On Maruti Rao Death-TeluguStop.com

ఈ అంత్యక్రియలకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.మారుతీరావు ఆత్మహత్యపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

తాజాగా ఒక టాలీవుడ్ దర్శకుడు మారుతీరావు ఆత్మహత్య గురించి వ్యంగ్యంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.” 18 ఏళ్ళు నిన్ను గారాబంగా పెంచాను…పెన్సిలు, రబ్బరు, బొట్టుబిళ్ళ, పప్పరమిట్టు….ఏది అడిగితే అది….

ఇదంతా ఎందుకోసం ?? నేను ఏ మలపత్రాష్టుడిని తెచ్చినా….తలదించుకొని తాళి కట్టించికొని ఆదర్శ నారిగా నిలుస్తావని… ఏమన్నా అంటే…నీ భర్త ని చంపించావు అంటావే ? 20 లక్షలు ఒక కిరాయి హాంతకుడికి ఇచ్చినప్పుడు… అందులో ప్రతి నోటు…నాన్న ప్రేమతో తపించిపోయాయి….అల్లుడిని చంపానే కానీ…నిన్ను కాదుగా…అక్కడైన నీకు నా ప్రేమ అర్థం కాలేదా ???
గర్భవతిగా ఉన్న కూతురు కోసం ఒక మర్డర్ చేయిస్తే… అది తండ్రి ప్రేమ…చనిపోయిన కుర్రాడి తండ్రిది మాత్రం కుట్ర అనుకునే గొర్రెగాళ్ళు నా అభిమానులు… వాళ్ళకే నా ప్రేమ అర్థం అయింది… నీకెందుకు కాలేదు…పర్లేదు….నన్ను అభిమానిస్తున్న ప్రతి ఇంట్లో కూతురికి నేను తండ్రిగా వస్తా….ప్రతి కొడుక్కి మామా గా వస్తా….” అంటూ దర్శకుడు పోస్ట్ చేశాడు.తండ్రి ప్రేమకు మారుతీరావు ప్రతిరూపమని ఆయన చనిపోయిన రోజును ఫాదర్స్ డేగా ప్రకటించాలని డిమాండ్ చేశాడు.దర్శకుడు పెట్టిన పోస్ట్ పై నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube