నేను గే అంటే జనాలు అస్సలు నమ్మరు...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ తనదైన శైలిలో లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఎంతోమంది యువ దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్న టాలీవుడ్ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ “రామ్ గోపాల్ వర్మ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో ఒక వివాదంతో సావాసం చేస్తూ కొత్త కొత్త వివాదాలకు తెర లేపుతున్నారు.

 Tollywood Director Ram Gopal Varma Sensational Comments On His Gender, Tollywood-TeluguStop.com

అంతేకాకుండా కొత్త టాలెంట్ ని అన్వేషించడం అలాగే వినియోగించుకోవడం రామ్ గోపాల్ వర్మ కి వెన్నతో పెట్టిన విద్య.కాగా తాజాగా రామ్ గోపాల్ వర్మ మేఘ ఆకాష్ ప్రధాన పాత్రలో నటించిన డియర్ మేఘ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని పలు సంచలన వ్యాఖ్యలు చేసి మళ్లీ హాట్ టాపిక్ గా మారాడు.

అయితే ఇందులో భాగంగా తన గురించి టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎన్ని పుకార్లు వినిపించినా ప్రజలు నమ్ముతారని కానీ తాను నపుంసకుడు (గే) అంటే మాత్రం అస్సలు నమ్మరని ఆ విషయం జనాలకి బాగా తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఇక ఈ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించిన మేఘా ఆకాష్ గురించి స్పందిస్తూ 40 సంవత్సరాల క్రితం ఇలాంటి అమ్మాయి కనుక తనకు తగిలి ఉంటే ప్రస్తుతం తన లైఫ్ ఇంకోలా ఉండేదని అలాగే ఈ చిత్రంలో తన పాత్రకు వందశాతం న్యాయం చేసిందని తన నటనా ప్రతిభను కొనియాడాడు.

Telugu Gender, Dear Megha Pre, Ram Gopal Varma, Rgv, Tollywood, Tollywoodram-Mov

అంతేకాకుండా ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కూడా తెలిపాడు.అయితే ఏదేమైనప్పటికీ రామ్ గోపాల్ వర్మ ఇలా ఆడియో ఫంక్షన్ లో హీరోయిన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం అలాగే ప్రజలు నమ్మరని చెప్పడం వంటి అంశాలతో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాడు.దీంతో కొందరు నెటిజన్లు మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ మాటలతో పబ్లిసిటీ చేయడంలో రామ్ గోపాల్ వర్మని మించినోడు లేడని కామెంట్లు చేస్తున్నారు.

అయితే గతంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎన్నో హిట్లు అందుకున్న రామ గోపాల్ వర్మ ఈమధ్య మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాడు.

దీనికి తోడు ఈ మధ్య కాలంలో రాంగోపాల్ వర్మ ఎక్కువగా అడల్ట్ కంటెంట్, బోల్డ్ కంటెంట్, రియల్ లైఫ్ స్టోరీస్, వెబ్ సిరీస్ లో ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నప్పటికీ రామ గోపాల్ వర్మ చిత్రాలు మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube