వావ్… అక్కడ చనిపోయే వాళ్ళకి కూడా ప్యాకేజీలు ఉంటాయంటున్న  పూరీ…  

Director Puri jagannathComments on Death Celebrations,Puri jagannadh, Tollywood Director, after death party, Sensational comments, Tollywood, Fighter movie News - Telugu After Death Party, Fighter Movie News, Puri Jagannadh, Sensational Comments, Tollywood, Tollywood Director

ఎలాంటి సినిమా కుటుంబం బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చి స్టార్ డైరెక్టర్ గా ఎదిగినటువంటి దర్శకుల్లో టాలీవుడ్ ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకరు.అయితే ఎప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండేటువంటి పూరి జగన్నాథ్ ఈ మధ్య మోటివేషనల్ వర్డ్స్ చెబుతూ సినీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాడు.

TeluguStop.com - Tollywood Director Puri Jagannadh Sensational Comments On After Death Party

అయితే తాను ఈ మధ్య యూరప్ వెళ్లానని అయితే అక్కడ  మానవ జీవితానికి సంబందించిన ఓ ఆసక్తికర అంశాన్ని గమనించానని ఆ విషయం గురించి తెలిపాడు. అయితే ఇందులో భాగంగా మామూలుగా ఎవరైనా పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు లేదా మరే ఇతర వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి బాగా ఆసక్తి కనబరుస్తుంటారు కానీ అక్కడి ప్రజలు మాత్రం తమ చావుని కూడా సెలబ్రేట్ చేసుకునేందుకు చనిపోయే ముందు సన్నాహాలు చేసుకుంటారని తెలిపాడు.

అయితే తాము చనిపోయిన అనంతరం తమ తన భౌతిక కాయాన్ని పూడ్చి పెట్టడం నుంచి చివరికి సెండాఫ్ పార్టీ కి వచ్చినటువంటి వారికి ఎలాంటి సదుపాయాలు భోజనాలు కల్పించాలనే విషయం గూర్చి ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఉంటాయని తన కళ్ళ ముందే ఇద్దరు దంపతులు తమ మరణానంతరం తమ చావుని ఎలా సెలబ్రేట్ చేయాలనే విషయంపై ఓ ప్యాకేజీ ని తీసుకుని వెళ్లినట్లు గమనించాను అని కూడా తెలిపాడు.

TeluguStop.com - వావ్… అక్కడ చనిపోయే వాళ్ళకి కూడా ప్యాకేజీలు ఉంటాయంటున్న  పూరీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో పూరి జగన్నాథ్ చావు సెలెబ్రేషన్స్ పై చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మామూలుగా స్టోరీ సెట్టింగ్ కోసం ఇతర దేశాలకు వెళ్లేటువంటి పూరి జగన్నాథ్ ఇలాంటి విషయాలపై బాగా ఆసక్తి ఉన్నందున వాటి గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటాడు.
 

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూరి జగన్నాథ్ తెలుగులో టాలీవుడ్ రౌడీ  విజయ్ దేవరకొండ  హీరోగా నటిస్తున్న “ఫైటర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.అయితే ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తయిన అనంతరం తన తదుపరి చిత్రం మెగాస్టార్ చిరంజీవి తో చేయనున్నాడని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అంతేగాక ఇప్పటికే ఈ చిత్రానికి “ఆటో జానీ” అనే టైటిల్ ని కూడా అనుకుంటున్నట్లు సమాచారం.

#Puri Jagannadh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Director Puri Jagannadh Sensational Comments On After Death Party Related Telugu News,Photos/Pics,Images..