ప్రముఖ డైరెక్టర్ మృతి.. టాలీవుడ్ లో విషాదం!

Tollywood Director Ks Nageswara Rao Passed Away

టాలీవుడ్ ఇండస్ట్రీ లో విషాదం నెలకొంది.ప్రముఖ దర్శకుడు మృతి చెందడంతో టాలీవుడ్ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది.

 Tollywood Director Ks Nageswara Rao Passed Away-TeluguStop.com

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వర రావు అనారోగ్యం కారణంగా మరణించినట్టు తెలుస్తుంది.ఈ విషయాన్నీ ఆయన కొడుకు కూడా ధ్రువీకరించాడు.

ఫిట్స్ కారణంగా ఆయన మరణించినట్టు ఆయన కుమారుడు తెలిపాడు.

 Tollywood Director Ks Nageswara Rao Passed Away-ప్రముఖ డైరెక్టర్ మృతి.. టాలీవుడ్ లో విషాదం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేఎస్ నాగేశ్వరరావు తన సొంత ఊరు నుండి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఫిట్స్ రావడంతో దారిలోనే ఆయన మరణించినట్టు తెలుస్తుంది.

ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు.ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ సినీ ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు.

ఆయన తన కారులో సొంత ఊరు నుండి హైదరాబాద్ బయలు దేరి వస్తుండగా కోదాడ సమీపంలో ఆయనకు ఫిట్స్ వచ్చాయని దాంతో స్థానికుల సహాయంతో హాస్పిటల్ కు తరలించారు.

మూడు ఆసుపత్రులకు తరలించిన ప్రయోజనం లేక చివరకు ఏలూరు ఆసుపత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే మరణించినట్టు తెలిపారు.

కానీ సమయానికి వైద్యం అందాకా పోవడంతో ఆయన మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.ఆయన మృతదేహాన్ని వాళ్ళ అత్తగారి గ్రామం అయినా కవులూరు కు తీసుకు వెళ్లారు.ఇక అక్కడే ఆయనకు అంత్యక్రియలు చేయనున్నట్టు ఆయన కొడుకు తెలిపాడు.

ఆయన స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అసిస్టెంట్ గా 1986 నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ ను కొనసాగించారు.రిక్షా రుద్రయ్య సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యాడు.ఆ తర్వాత శ్రీహరి హీరోగా ‘పోలీస్’ అనే సినిమాను తెరకెక్కించగా మొదటి రెండు సినిమాలు హిట్ అవ్వడంతో కెరీర్ లో వెనకడుగు వేయలేదు.

ఆ తర్వాత డైరెక్టర్ గా వరుస సినిమాలు తీసాడు.ఇక ప్రసెంట్ ఆయన తన కొడుకు హీరోగా ఒక సినిమా స్టార్ట్ చేసాడు.కానీ మధ్యలోనే ఇలా జరగడంతో అందరిని బాధకు గురి చేస్తుంది.

#RIPKS #SeniorKS #SeniorKS

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube