ఆఫ్టర్ డైవర్స్ సమంత తన ఫోకస్ మొత్తం సినిమాల మీద పెట్టినట్టు అర్ధమవుతుంది.ఇప్పటికే తమిళ సినిమాలో నటిస్తున్న సమంత లేటెస్ట్ గా హాలీవుడ్ సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది.
అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే నవల ఆధారంగా తెరకెక్కే ఇంటర్నేషనల్ మూవీలో సమంత నటిస్తుంది.ఈ సినిమాలో సమంత బై సెక్యువల్ తమిళ అమ్మాయిగా కనిపించనుందట.
డోంటన్ అబ్బే ఫేమ్ ఫిలిప్ జాన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.సమంత హాలీవుడ్ సినిమా గురించి న్యూస్ రాగానే ఆమెతో ప్రస్తుతం శాకుంతలం సినిమా చేస్తున్న డైరక్టర్ గుణశేఖర్ స్పందించారు.
ఇంతకీ గుణశేఖర్ ఏమని కామెంట్ చేశారు అంటే మీ డెడికేషన్ కు ఇది తగిన ఫలితం.ఇంకా మరెన్నో రావాలని రాసుకొచ్చారు.
గుణశేఖర్ ట్వీట్ కు సమంత కూడా థ్యాంక్ యు సర్ అంటూ రిప్లై ఇచ్చింది.మొత్తానికి సమంత ఇంటర్నేషనల్ మూవీకి అన్ని వైపుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని తెలుస్తుంది.
సమంత చేస్తున్న ఫస్ట్ హాలీవుడ్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ఇండియాలో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. శాకుంతలం సినిమాతో కూడా సమంత మొదటిసారి మైథలాజికల్ మూవీ అటెంప్ట్ చేస్తుంది అమ్మడు.