2021లో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్లు ఎవరో తెలుసా?

2021.ఈ ఏడాది చాలా మంది కొత్త హీరోయిన్లు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు.వెండి తెరపై సందడి చేశారు.వారిలో కొందరు మంచి నటనతో ఆకట్టుకుని బెస్ట్ డెబ్యూ హీరోయిన్లుగా మారితే.మరికొందరు మాత్రం ఇలా వచ్చి.అలా వెళ్లారు అన్నట్లు కనిపించారు.ఇంతకీ 2021లో ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 Tollywood Debue Heroines In 2021 , Amrita Iyer , Faria Abdullah , Ketika Shar-TeluguStop.com

అమృతా అయ్య‌ర్

పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు జనాలకు పరిచయం అయిన ఈ అమ్మడు రామ్ నటించిన రెడం సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.ఆ తర్వాత 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?, అర్జున ఫ‌ల్గుణ‌ సినిమాల్ల నటించింది.

కృతి శెట్టి

బ్లాక్ బస్టర్ మూవీ ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా మారింది ఈ క్యూట్ బ్యూటీ.బేబమ్మ పాత్రలో ఒదిగిపోయి నటించింది.ఈ సినిమా తర్వాత వరుస అవకావాలు దక్కించుకుంటుంది.త్వరలో రిలీజ్ కాబోతున్న నాని శ్యామ్ సింగ రాయ్ లోనూ హీరోయిన్ గా చేస్తుంది.

ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్

చెక్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది.అనంతరం ఇష్క్ సినిమాలోనూ నటించింది.ఈ సినిమాలు ఈమెకు కలిసి రాలేదు.

ఫ‌రియా అబ్దుల్లా

సన్సెషనల్ హిట్ మూవీ జాతి రత్నాలులో హీరోయిన్ గా నటించింది.చిట్టి పాత్రలో నటించి అందరి చేత వారెవ్వా అనిపించుకుంది.ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లోనూ ఓ చిన్న రోల్ చేసింది.

శ్రీ‌లీల

పెళ్ళి సంద‌D సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ శ్రీలీల.అందం, అభినయంతో జనాలను ఆకట్టుకుంది.అటు రవితేజాతో ధమాకా సినిమా చేస్తుంది.

కేతికా శ‌ర్మ

రొమాంటిక్ సినిమాతో తెలుగు జనాలకు పరిచయం అయ్యింది.ఆ తర్వాత లక్ష్య‌ సినిమాలోనూ సందడి చేసింది.ఈ రెండు సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేదు.

శివానీ రాజ‌శేఖ‌ర్

రాజశేఖర్-జీవిత పెద్ద కూతురు అద్భుత సినిమాతో హీరోయిన్ గా మారింది.ఈ సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Amrita Iyer , Faria Abdullah , Ketika Sharma, krithishetty , Priya Prakash Warrior, Shivani Rajasekhar , Srileela , Tollywood
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube