ఆరు నెలల పాటు సినిమాలకు గడ్డు పరిస్థితులే

ఈనెల 14 తర్వాత లాక్‌ డౌన్‌ ఎత్తివేస్తారు సినిమా పరిశ్రమ మునుపటి జోరుతో ముందుకు సాగుతుందని భావిస్తున్న వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఒక వార్త.ఆ వార్త సారాంశం ఏంటీ అంటే లాక్‌ డౌన్‌ ఎత్తి వేసిన తర్వాత కూడా కనీసం రెండు లేదా మూడు నెలల పాటు థియేటర్లు మూత వేసే ఉండవచ్చు.

 Coming Six Months Veary Difficult For Movie Releases, Tollywood, Corona Virus, C-TeluguStop.com

ఒకవేళ థియేటర్లు వెంటనే ఓపెన్‌ చేసినా కూడా ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు వచ్చేందుకు ధైర్యం చేయరు అంటున్నారు.

థియేటర్లలో దగ్గర దగ్గర కూర్చోవడంతో పాటు క్లోజ్డ్‌గా ఉంటాయి కనుక వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి.

 Coming Six Months Veary Difficult For Movie Releases, Tollywood, Corona Virus, C-TeluguStop.com

ఆ కారణంగానే వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఎంత దూరంగా థియేటర్లకు ఉంటే అంత మంచిది అనే ఉద్దేశ్యంలో ప్రముఖ మీడియా సంస్థ అంటోంది.ఈ నేపథ్యంలో సినిమాల విడుదల ఉండక పోవచ్చు.

ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు విడుదల ఉండక పోవచ్చు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Telugu Cinima Theaters, Corona, Producers, Heros, Tollywood-Movie

సినిమా పరిశ్రమలో పరిస్థితులు మళ్లీ మామూలు స్థితికి రావాలంటే మాత్రం చాలా కాలం పట్టవచ్చు అంటున్నారు.ముఖ్యంగా థియేటర్లు మునుపటి స్థితితో కిటకిటలాడాలంటే కనీసం ఆరు నెలలు అయినా పడుతుందని అంటున్నారు.అప్పటి వరకు థియేట్ల యాజమాన్యాలకు ఇంకా సినిమా నిర్మాతలకు రక్త కన్నీరు తప్పదు అంటున్నారు.

ఇక షూటింగ్స్‌ మెల్ల మెల్లగా సాగే అవకాశం ఉంది.సినిమా విడుదలకు ఛాన్స్‌ లేనప్పుడు మేకింగ్‌ విషయంలో కూడా నిర్మాతలు ఆసక్తి చూపించరు.

కనుక షూటింగ్స్‌ చాలా స్లోగా తక్కువగా జరుగుతాయని అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube