టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కమెడియన్స్ వీళ్లే?

సినిమాలకు హీరో హీరోయిన్లు ఎంత ముఖ్యమో అటు కమెడియన్స్ కూడా అంతే ముఖ్యం అన్న విషయం తెలిసిందే.ఇక కొన్ని కొన్ని సినిమాలు కేవలం కమెడియన్స్ చేసిన కామెడీతోనే విజయం సాధించినవి కూడా ఉన్నాయి.

 Tollywood Comedians Remuneration Brahmanandam Ali Suneel Posani Details, Tollywo-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పర్చుకుని ప్రేక్షకులకు కామెడీని పంచుతూ ఉంటారు.ఇక సాధారణంగా హీరోలు ఒకటి రెండు సినిమాల్లో నటిస్తూ ఉంటారు.

కానీ కమెడియన్స్ మాత్రం అందరి హీరోల సినిమాల్లో సంవత్సరమంతా బిజీబిజీగా గడుపుతూ ఉంటారు.ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కమెడియన్స్ అటు రెమ్యునరేషన్ విషయంలో కూడా భారీగానే వసూలు చేస్తారట.ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కమెడియన్స్ లో ఎవరు ఎంత పారితోషికం చేసుకుంటారూ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

వెన్నెల కిషోర్ :

వెన్నెల అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు కమెడియన్గా పరిచయమయ్యాడు.ఈ సినిమా కలిసి రావడంతో తన ఇంటి పేరును వెన్నెల గా మార్చుకున్నాడు కిషోర్.తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు.

ఇటీవల కాలంలో వెన్నెల కిషోర్ లేని సినిమా కోసం భూతద్దం పెట్టి వెతికినా దొరకదు అని చెప్పాలి.అయితే సుమారు రోజుకు 2 నుంచి 3 లక్షల వరకు పారితోషికం తీసుకుంటాడట.

బ్రహ్మానందం :

కామెడీ టైమింగ్ తో కాదు ఆయన ఎక్స్ప్రెషన్ తోనే అందరినీ కడుపుబ్బ నవ్వించే సత్తా బ్రహ్మానందంకే సొంతం.అందుకే ఆయనను హాస్యబ్రహ్మ అని పిలుస్తూ ఉంటారు అభిమానులు.కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో వందల సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను నవ్వించారు ఆయన.బ్రహ్మానందం ఒక రోజుకి మూడు లక్షల వరకు పారితోషికం పుచ్చుకుంటారట.

ఆలీ :

ఎంద చాట బుచ్కి బుచ్కి అంటూ తనదైన డైలాగ్ డెలివరీతో క్రేజ్ సంపాదించాడు కమెడియన్ ఆలీ. వెండితెరపై కమెడియన్గా మాత్రమే కాదు బుల్లితెరపై వ్యాఖ్యాతగా కూడా అదరగొడుతున్నాడు.ఇక కమెడియన్ అలీ ఒక్క రోజుకి 3.5 లక్షల వరకు పారితోషికం తీసుకుంటారట.

సునీల్ :

ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన సునీల్ ఆ తర్వాత హీరోగా ఇక ఇప్పుడు మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు.ఇక సునీల్ ఒక్కో సినిమాకి నాలుగు లక్షల వరకు పారితోషికం తీసుకుంటారట.

సప్తగిరి :

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సప్తగిరి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్ గానే కొనసాగుతున్నాడు.సప్తగిరి ఒక్క రోజుకి రెండు లక్షలు పారితోషికం తీసుకుంటారట.

పోసాని కృష్ణ మురళి :

నా రూటే సపరేటు అన్న విధంగా ఉంటుంది పోసాని కామెడీ.అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు ఈయన.కమెడియన్ గా మాత్రమే కాకుండా దర్శకుడిగా రైటర్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే పోసాని కృష్ణ మురళి ఒక్క రోజుకి సుమారు 2.5 లక్షల పారితోషికం తీసుకుంటారట.

రాహుల్ రామకృష్ణ :

నేటితరం కమీడియన్స్ లో రాహుల్ రామకృష్ణ ఒకరు.సొంత టాలెంట్ తోనే క్రేజ్ సంపాదించుకునీ ఇక ఇప్పుడు టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న కమెడియన్ గా కొనసాగుతున్నాడు.ఇక రాహుల్ రామకృష్ణ సుమారు రోజుకి రెండు లక్షల వరకు పారితోషికాన్ని తెచ్చుకుంటాడట.

30 ఇయర్స్ పృద్విరాజ్ :

30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు పృథ్వి రాజ్.అప్పటి నుంచి ఆయన పేరు 30 ఇయర్స్ పృథ్వి గా మారిపోయింది.అయితే మొన్నటి వరకు వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో రెండు లక్షల పారితోషికం తీసుకున్న పృథ్వి రాజ్.ఇప్పుడు మాత్రం రోజుకు లక్ష వరకు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.

ప్రియదర్శి :

డైలాగ్ డెలివరీతో నేటితరం ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధుల్ని చేసి కడుపుబ్బ నవ్వించాడు ప్రియదర్శి.కమెడియన్గా మాత్రమే కాకుండా తనలోని నటుణ్ణి నిరూపించుకునేందుకు హీరోగా నటించాడు.ఇకపోతే ప్రియదర్శి కమెడియన్ పాత్రలకు ఒక్క రోజుకి రెండు లక్షలు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట.

శ్రీనివాస్ రెడ్డి :

అప్పుడెప్పుడో వచ్చిన ఇడియట్ సినిమాతో గుర్తింపు సంపాదించుకున్న శ్రీనివాసరెడ్డి తన కామెడీ టైమింగ్ తో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు.ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి కమెడియన్ గా గుర్తింపు సంపాదించాడు.కాగా శ్రీనివాసరెడ్డి ఒక్క రోజుకి రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.

Tollywood Top Comedians Remuneration Brahmanandam Ali

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube