కమెడియన్ రమణారెడ్డి గారు ఎంతో బాధ అనుభవిస్తూనే మనల్ని ఎలా నవ్వించేవారు తెలుసా..?

ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాగాని, ఎన్నో సినిమాల్లో నటించిన గాని ప్రభుత్వ గౌరవాలు గాని ఇతరత్రా సత్కారాలు కానీ పొందకుండా చనిపోయిన నటి నటులు మన చిత్ర సీమలో చాలా మందినే ఉన్నారు.నటి నటులే కాకుండా టెక్నీషియన్స్ కూడా చాలామందిని ఉన్నారు.

 Tollywood Comedian Ramana Reddy Untold Story,sanitary Inspector, Madras, Mayapil-TeluguStop.com

అటువంటి వారి గురించి తలుచుకుంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది.వీరు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కానీ వీరికి సరైన గుర్తింపు అనేది లభించలేదు అని బాధపడుతూనే ఉంటాం.

అలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రముఖ హాస్యనటులు రమణారెడ్డి గారు కూడా ఈ కోవకు చెందినవారే.రమణా రెడ్డిగారు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది సినిమా ఏదైనా ఉంది అంటే మాయాబజార్ సినిమా లోని చిన్నమయ్య క్యారెక్టర్, గుండమ్మ కథ సినిమాలో గంటయ్య,కుల గోత్రాలు సినిమాలో పేకాట రాయుడు ఇలా ఎన్నో సినిమాల్లో రమణారెడ్డి గారు నటించారు.

ఆ రోజుల్లో రేలంగి, రమణా రెడ్డి కాంబినేషన్ ఎలా ఉండేది అంటే తెరపై వీళ్ళను చూస్తే చాలు ప్రేక్షకులకు నవ్వులే నవ్వులే.అంతలా అందరిని నవ్వించేవారు.

ముఖ్యంగా రమణా రెడ్డిగారు నెల్లూరు మాండలికంలో మాట్లాడేవారు.

ఏ సంభాషణలు వచ్చినాగాని ఆ యాసలోనే చెప్పేవారు.

ఆ మాటలు విన్నా వెంటనే నవ్వు వచ్చేస్తుంది.ఈయన పూర్తి పేరు తిక్కవరపు వెంకట రమణారెడ్డి.

నెల్లూరులో శానిటరీ ఇన్స్పెక్టర్ గా పని చేస్తూ ఉండేవారు.శని ఆదివారాల్లోనూ, శెలవు రోజుల్లోనూ మద్రాసు వచ్చి అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవాడు.

A.శంకర రెడ్డి గారు 1951 లో మాయపిల్లా అనే సినిమా నిర్మిస్తూ అందులో మొట్టమొదట రమణా రెడ్డి గారికి హాస్య పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు.అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు.తరువాత వేరే చిన్న సినిమాల్లో నటించినా గాని గుర్తింపు అనేది రాలేదు.అయితే ఆయనకు బంగారపు పాప సినిమా వలనే కొంత గుర్తింపు వచ్చింది.ఆ తరువాత మిస్సమ్మ సీనియాలో డేవిడ్ పాత్రతో ఆయన ప్రతిభ ఏంటో అందరికి తెలిసివచ్చింది.

ఇంకా సినిమాలలో వేషాలు రావడంతో ఆయన పూర్తిగా ఉద్యోగం మానేసి ఇంకా సినిమాల మీదనే ఆయన దృష్టిని కేంద్రీకరించారు.అలాగే సినిమాల్లో వేషాలు రాని రోజుల్లో ఆయన గాత్ర దానం కూడా చేసేవారు.

అంటే డబ్బింగ్ కూడా చెప్పేవారు.అలాగే రమణా రెడ్డిగారు సెట్ లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడే యాస బాష విని అందరు కూడా నవ్వు ఆపుకోలేకపోయేవారట.

అలాగే రమణా రెడ్డిగారు మ్యాజిక్ కూడా చేస్తారు.

Telugu Ba Subbarao, Bangaru Papa, Raman, Madras, Magician, Maya Bazaar, Mayapill

చాలామందికి ఆయన మ్యాజిక్ గురించి తెలిసి ప్రదర్శనలు ఇవ్వమని అడగడానికి వచ్చేవారట.అయితే అప్పట్లో ఆయన ధర్మ కార్యక్రమాలకు మ్యాజిక్ ను ఉపయోగించేవారు ఎవరయిన ఒక సంక్షేమ సంఘం నుంచి వచ్చి మాకు ఎదో ఒక సహాయం చేయమని అడిగితే అప్పుడు ఆయన ఒక ప్రదర్శన చేస్తాను.మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పి మ్యాజిక్ చేసేవాడు.

అయితే ఆ ప్రదర్శనకి రెమ్యూనిరేషన్ ఏమి తీసుకోకుండా దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఆ సంస్థకి సహాయ పడేవారు.అయితే ఆయనలో ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే సన్నగా ఉండడం.

సినిమాలో ఏదన్నా పాత్రలో పడిపోమంటే టక్కున అలా కిందకి పడిపోయేవారట.కానీ దెబ్బలు తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకునేవారట.

సినిమాలో ఇలాంటి సీన్ లు ఉన్నప్పుడు ఉన్నట్టుండి పడిపోవడం,మళ్ళీ ఉన్నట్టుండి లేవటం ఇలాంటివి చూసినప్పుడు ప్రేక్షకులకు బాగా నవ్వు వచ్చేది.ఇంకొక విశేషం ఏమిటంటే అప్పట్లో బి.

ఎ.సుబ్బారావు గారు రేలంగి చేత నారదుడి వేషం వేయించారు.ఆ సినిమా కూడా బాగా ఆడింది అలాగే రేలంగి కూడా మంచి పేరు వచ్చింది.రమణా రెడ్డిగారిని అభిమానించే కే ఎస్ ప్రకాశరావు గారు అంటే నేటి ప్రసిద్ధ దర్శకుడు కే రాఘవేంద్ర రావుగారి తండ్రి అన్నమాట.

అయితే ప్రకాశరావుగారికి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది.అగ్ని చేత నారదుడి వేషం వేయించినప్పుడు రమణారెడ్డి గారు చేత నారదుడి వేషం ఎందుకు వేయించకూడదు అన్న ఆలోచన వచ్చింది.

రంగారెడ్డి గారిని గెలిపించి నారదుడి వేషం వేయమన్నారు.అయితే ఆ మాట విన్న రమణారెడ్డి గారు పక్కున నవ్వి ఏంటి నేనా.నారదుడి వేషమా? ఎముకుల గూడులా ఉన్న నన్ను నారదుడి వేషంలో చూస్తే ప్రేక్షకులు నన్ను చూసి దడుచుకుంటారు.ఏమి కాదు నువ్వు వెయ్యవయ్యా అని రమణా రెడ్డి గారితో నారదుని వేషం వేయించారు.

రేణుకా దేవి మహత్యం సినిమాలో రమణా రెడ్డి గారు నారదుడి వేషం వేశారు.అది కూడా జనాన్ని మెప్పించింది.అయితే మళ్ళీ బీఏ సుబ్బారావు గారు రేలంగి చేత హనుమంతుడి వేషం వేయించారు.అయితే రమణా రెడ్డి అది గుర్తు చేసుకుని కే ఎస్ ప్రకాశరావు గారి దగ్గరకు వెళ్లి నా చేత నారదుడు వేషం వేయించారు.

మరి హనుమంతుడు వేషం ఎప్పుడు వేయిస్తారు అని నవ్వుతు అడిగేసరికి ఆయనకి కోపం వచ్చి రమణా రెడ్డి చెవి మెలితిప్పే అప్పటికి ఆయన తప్పించుకుని పారిపోయారట.ఇది కూడా ఆయన చెప్పిన సంఘటనే.

ఇలా రమణారెడ్డి గారు అందరిని నవ్వించేవారు.అందరిని నవ్వించే రమణా రెడ్డిని మాత్రం అనారోగ్యాలు పట్టుకుని పీడించేవి.

కాలేయ సంబంధిత వ్యాధులతో బాధ పడేవాడు.ఆ సమస్యతోనే ఆయన తన 53వ ఏట శేషులు అయ్యారు కీర్తిశేషులు అయ్యారు.

ఆ వయసులో ఆయన చనిపోవడం అందరిలో షాక్ కు గురి చేసింది.ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా గాని సినిమా రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటారు.“అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయానే” అనే పాట విన్నప్పుడు అల్లా మనకి రమణా రెడ్డిగారే గుర్తుకు వస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube