అతిలోక సుందరి శ్రీదేవి కి డూప్ నటించిన ఆ కమెడియన్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లు చాలా కష్టపడి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వాళ్లకు సంబంధించిన స్టార్ డమ్ వచ్చేంతవరకు కష్టపడుతూనే ఉంటారు.ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో, హీరోయిన్ ఎవరైనా సరే కష్టపడి పైకి వచ్చిన వారే కొందరు వారసత్వం ద్వారా వచ్చినప్పటికీ కష్టపడితేనే వాళ్లు కూడా పైకి ఎదిగారని చెప్పొచ్చు లేకపోతే చాలామంది వారసులు హీరోలుగా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు అనే విషయం మనందరికీ తెలిసిందే.

 Tollywood Comedian Worked As Dupe For Heroine Sridevi, Heroine Sridevi, Hema, Ka-TeluguStop.com

అయితే రోజు హీరోయిన్లు షూటింగ్ లలో చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళు ఎంత కష్టపడి రిస్కు చేసినప్పటికి కొన్ని పర్టిక్యులర్ సమయాలలో మాత్రం వాళ్ళకి డూపు ఉండాల్సిందే హీరోలు అయితే యాక్టింగ్ పరంగా ఎంత కష్టపడినా ఇప్పటికీ కొన్ని రిస్కీ షాట్స్ చేసేటప్పుడు తప్పనిసరిగా డూప్ లను వాడాల్సి ఉంటుంది ఎందుకంటే వాటిని చేయడానికి స్టంట్స్ తెలిసిన వాళ్ళు సపరేట్ గా ఉండటం వల్ల వాళ్ళు హీరోకి డుప్ గా చేస్తూ ఉంటారు.ప్రస్తుతం చిన్న హీరో, పెద్ద హీరో అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి డూప్ అనేది కంపల్సరీ అయిపోయింది.

Telugu Hema, Hema Sridevi, Heroes Dupe, Sridevi, Kiran Raju, Senior Ntr, Tollywo

తెలుగు సినిమా పేరును ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి అందులో ప్రభాస్ డూపు గా చాలా సీన్లలో కిరణ్ రాజు అనే ఒక డూపు మనిషి కనిపించేవాడు దర్శకుడు ఈ డూపు నీ పెట్టి షాట్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏమాత్రం సినిమా చూసే ఆడియన్స్ కి డౌట్ రాకుండా మేనేజ్ చేస్తూ తీసుకుంటారు బాహుబలి లో ప్రభాస్ కి డూపు గా నటించిన కిరణ్ రాజుకి కూడా మంచి పేరు వచ్చింది.

Telugu Hema, Hema Sridevi, Heroes Dupe, Sridevi, Kiran Raju, Senior Ntr, Tollywo

ఇప్పుడనే కాదు అప్పట్లో కూడా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా టైంలో ఒక సీన్ తీసేటప్పుడు శ్రీదేవి గారికి డూపుగా ఇప్పుడు నటి హేమ గారు నటించారు.అమ్రిష్ పురి శ్రీదేవి కోసం వచ్చినప్పుడు తను జలపాతంలో ఈత కొడుతూ ఉంటుంది అయితే శ్రీదేవికి ఈత రాకపోవడంతో హేమతో లాంగ్ షాట్ లో పెట్టి శ్రీదేవి కొడుతున్నట్టుగా ఆ సీన్ తీశారు.ఆ తర్వాత హేమ, శ్రీదేవి కలిసి క్షణక్షణం సినిమాలో నటించారు.

ఆ తర్వాత కూడా హేమ చాలా సినిమాల్లో బ్రహ్మానందం కు జోడీగా నటించి కామెడీ చేస్తూ మనకు కనిపిస్తూనే ఉన్నారు.

Telugu Hema, Hema Sridevi, Heroes Dupe, Sridevi, Kiran Raju, Senior Ntr, Tollywo

హేమ అంటే అతడు సినిమాలో భర్త కు అనుగుణంగా నడుచుకునే భార్య పాత్రలో ఒదిగిపోయి నటించారు అని చెప్పాలి.ఒక వెటకారపు మాటలు మాట్లాడే భర్తతో అమాయకురాలైన ఒక భార్య పడే పాట్లు ఎలా ఉంటాయనేది అతడు సినిమాలో హేమగారు తన నటనతో చాలా బాగా చూపించారు.ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో బ్రహ్మానందం కి జోడిగా నటించి తన కామెడీతో అందరినీ కడుపుబ్బ నవ్వించారు.

Telugu Hema, Hema Sridevi, Heroes Dupe, Sridevi, Kiran Raju, Senior Ntr, Tollywo

వీళ్ళకే కాదు అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా డూపు గా చాలా మంది ఆర్టిస్టులు నటించేవారు.ఇందులో కైకాల సత్యనారాయణ గారు కూడా సీనియర్ ఎన్టీఆర్ గారికి చాలా సినిమాల్లో డూప్ గా నటించారు.అయితే సినిమాలో హీరోలు డూప్ లను పెట్టడం వల్ల డూప్ గా చేసే వాళ్లకి కూడా కొంత ఇన్ కం అనేది రావడం జరుగుతుంది దీని వల్ల వాళ్లు కూడా వాళ్ల జీవనోపాధిని సినిమా మీద ఆధారపడి కొనసాగించడానికి అవకాశం కలుగుతుంది.అయితే హీరోలకి డూప్ లుగా చేయడం అనేది మనం అనుకున్నంత ఈజీ గా ఉండదు.

ఎందుకంటే వాళ్ళు చాలా రిస్కీ షాట్స్ చేయాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో చేతులు కాళ్ళు కూడా విరిగిపోవచ్చు.కొన్నిసార్లు అయితే మనిషి కూడా చనిపోవచ్చు.డూప్ లు సినిమా కోసం వాళ్ల ప్రాణాలకు తెగించి రిస్క్ చేస్తూ ఉంటారు.హీరోల కంటే కూడా వీళ్లే ఎక్కువగా బాధలు అనుభవిస్తూ ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube