కరోనా ఎఫెక్ట్ : భార్య చెప్పిన పని బుద్దిగా చేస్తున్న కమెడియన్…  

Tollywood Comedian Ali Home Cleaning Photos Viral In Social Media - Telugu Comedian Ali, Tollywood Comedian Ali, Tollywood Comedian Ali Home Cleaning Photos, Tollywood Comedian Ali News

టాలీవుడ్ లో ప్రస్తుతం కకరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సినీ ప్రముఖులు తమ ఇళ్ల కే పరిమితమయ్యారు.దీంతో కొందరు తమ కుటుంబ సభ్యులతో జాలీగా గడుపుతున్నారు.

 Tollywood Comedian Ali Home Cleaning Photos Viral In Social Media

మరికొందరు కరోనా వైరస్ కారణంగా రోడ్డున పడి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సహాయ సహకారాలు అందించే పనిలో పడ్డారు.

అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ఆలీ ఇటీవలే ఈ కరోనా వైరస్ వల్ల ఇటలీలో పరిస్థితి దారుణంగా ఉందంటూ ఓ వీడియోను పోస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

కరోనా ఎఫెక్ట్ : భార్య చెప్పిన పని బుద్దిగా చేస్తున్న కమెడియన్…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా అలీ కి సంబంధించినటువంటి మరి కొన్ని ఫోటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ఫోటోలో కమెడియన్ ఆలీ తన ఇంటిని శుభ్రం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

అంతేగాక ప్రస్తుతం తాను ఈ లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటున్నానంటూ అలాగే తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నా అంటూ చెప్పుకొచ్చాడు.అంతేగాక కొంత సమయం తన భార్యకి ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తూ మరికొంత సమయం తన పిల్లలతో సరదాగా కబుర్లు చెబుతూ దేశానికి మరియు తన కుటుంబానికి సేవ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా టాలీవుడ్లోని అన్ని కార్యాలకు సంబంధించిన కార్యాలయాలను మూసివేశారు.అంతేగాక చిత్ర పరిశ్రమలో పని వారికి కూడా సెలవులు ప్రకటించి ఇంటికే పరిమితం కావాలని సూచించారు.

దీంతో పలువురు స్టార్లు మరియు హీరోయిన్లు తమ కుటుంబాలతో ఇంటికే పరిమితమయ్యారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు