తెలుగులో ప్రముఖ స్వర్గీయ సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన “అమ్మ రాజీనామా” అనే చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.ఈ చిత్రంలోని పాటలు చాలా మంది ఫేవరెట్ లిస్టులో ఉంటాయి.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేసినటువంటి టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా.కె.నాయుడు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా తాను ఇప్పటి వరకు సినిమా పరిశ్రమలో అందరి హీరోయిన్లతో చాలా కంఫర్టబుల్ గా పని చేశానని తెలిపాడు.
కానీ గోవా బ్యూటీ ఇలియానాతో మాత్రం కొంతమేర అసౌకర్యంగా అనిపించిందని తెలిపాడు.అయితే తనకు సాధారణంగా సినిమా సెట్ లో పెద్దగా కోపం రాదని కానీ ఒక్కోసారి కొంతమంది ఆలస్యంగా రావడం లేదా ఆలస్యమయ్యేటువంటి పనులు చేయడం వంటి కారణంగా అప్పుడప్పుడు కోప్పడుతూ ఉంటానని అంతేతప్ప కావాలని ఎవరి మీద కోపం రాదని తెలిపాడు.
కానీ ఇలియానా విషయంలో మాత్రం ఏం జరిగిందనే విషయంపై మాత్రం చోటా కె.నాయుడు ఎలాంటి విషయాలను తెలియజేయలేదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల చోటా.కె.నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన అల్లుడు అదుర్స్ చిత్రం విడుదలైంది.సంక్రాంతి కానుకగా విడుదలైన అల్లుడు అదుర్స్ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.