ప్రస్తుతం ఇతర భాషలలో మంచి సక్సెస్ లు అందుకున్న సినిమాలన్నీ తెలుగులో రీమేక్ అవుతూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి.ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు కూడా రీమేక్ తో తెలుగులో విడుదలవుతూ మంచి హిట్ ని అందుకుంటున్నాయి.
ఇక మరో తమిళ సినిమా కూడా తెలుగులో రీమేక్ కావడంతో పాటు ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా తాజాగా విడుదలయింది.
త్యాగరాజన్ కుమార రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘సూపర్ డీలక్స్’. ఈ సినిమా తమిళ రీమేక్ నుండి తెలుగులో విడుదల కానుంది.ఇక ఈ సినిమా సమాజం గురించి.ఓ ట్రాన్స్ జెండర్ గా మారిన ఓ వ్యక్తి గురించి, తన కుటుంబంలో చోటు చేసుకున్న భావోద్వేగాలు గురించి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇందులో సమంత, ఫాహద్ ఫాజిల్, రమ్యకృష్ణ, మిస్కిన్ వంటి పలువురు నటులు నటిస్తున్నారు.ఇక ఫాహద్, సమంత భార్య భర్తలు గా కనిపించనున్నారు.
ఇక వీరి మధ్య కూడా కథ సాగుతుంది.ఇందులో నటిస్తున్న రమ్యకృష్ణ తో మరో కథ సాగుతుంది.
అంటే ఒకేసారి నలుగురి జీవితాల్లో ఏం జరిగిందో అందులో నుంచి బయట ఎలా పడ్డారనే నేపథ్యంలో ముందుకు రానుంది.
థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా తమిళంలో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఇక తెలుగులో ఆగస్టు 6న ఓటీటీ ఆహా లో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన తెలుగులో ట్రైలర్ విడుదల చేయగా ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో వైరల్ గా మారగా.తెలుగులో కూడా సూపర్ హిట్ పక్క అని తెగ కామెంట్స్ వస్తున్నాయి.మొత్తానికి తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా ఈ సినిమా మంచి సక్సెస్ తో రావడానికి సిద్ధమయ్యింది.