సోషల్ మీడియాలో లీకైన చికాగో సెక్స్ రాకెట్ అఫిడవిట్.! లిస్ట్ లో 10 మంది హీరోయిన్లు, యాంకర్లు?       2018-06-21   23:23:23  IST  Raghu V

అమెరికాలోని చికాగో కేంద్రంగా తెలుగు దంపతులు మోదుగుమూడి కిషన్- చంద్రకళ నడిపిస్తున్న సెక్స్ రాకెట్ భాగోతం బయటపడిన తర్వాత పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.ఈ దందాలో పలువురు తెలుగు, కన్నడ హీరోయిన్లు ఇన్వాల్వ్మెంట్ ఉందని, కొందరు డబ్బు కోసం, మరికొందరు బలవంతంగా ఇందులోకి దిగినట్లు తెలుస్తోంది. కిషన్ దంపతులు అమెరికాలో తెలుగు ఈవెంట్ల పేరుతో ఇక్కడకు హీరోయిన్లను రప్పించి గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఈ వ్యహారంలో బాధితురాలుగా ఉన్న హీరోయిన్ (విక్టిమ్-ఎ)పై అమెరికా ఐదేళ్ల నిషేధం విధించినట్లు సమాచారం.

సెక్స్‌ రాకెట్‌ కేసు రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది. అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యురిటీ సాగిస్తున్న దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా పోలీసులు స్థానిక కోర్టులో దాఖలు చేసిన 40 పేజీల అఫిడవిట్‌ వెలుగులోకి వచ్చింది. ఆ అఫిడవిట్ పరిశీలిస్తే కోసు దర్యాప్తు పురోగతి, ఏ కోణంలో సాగుతోందన్న విషయం అవగతమవుతోంది.

ప్రస్తుతం ఆ అఫిడవిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్‌ చల్‌ చేస్తోంది. ఈ సెక్స్ రాకెట్ లో భాగమైన కొందరి పేర్లు సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఆ అఫిడవిట్‌లో అమెరికా దర్యాప్తు అధికారులు పేర్కొన్న ఏ, బీ, సీ, డీ, ఈ ఎవరై ఉంటారని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. వీరితో పాటూ మొత్తం బాధిత 10 మంది హీరోయిన్ల జాబితా కూడా వైరల్‌ అవుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఈ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ 10 మందిలో ప్రముఖ ఏడుగురు హీరోయిన్లు, ముగ్గురు పాపులర్ యాంకర్ ల పేర్లు ఉన్నాయి.

సెక్స్ రాకెట్‌కు సంబంధించి వెలుగు చూసిన డైరీలో ప్రస్తుతం ఏపీలో అత్యంత కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఎంపీ పేరు కూడా అందులో ఉన్నట్టు సమాచారం. నిందితుల మొబైల్ ఫోన్ సంభాషణల విశ్లేషణ కొనసాగుతున్న నేపథ్యంలో మరింత మంది బాధితుల పేర్లు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారతీయ అసోసియేషన్ల కార్యాక్రమాల్లో పాల్గొనడానికంటూ సినీ తారలకు వీసాలు ఇప్పించి అమెరికాకు రప్పిస్తారని పోలీసుల విచారణలో తేలింది.

-

గత ఏడాది నవంబర్‌ 20న ఓ హీరోయిన్‌ ఢిల్లీ నుంచి షికాగో వెళ్లింది. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ కాలిఫోర్నియా నవంబర్‌18న ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆమె పాల్గొనాలి. కానీ ఆమె రెండు రోజులు ఆసల్యంగా వచ్చి కాలిఫోర్నియా బదులు చికాగోకు వెళ్లింది. దీంతో అనుమానంతో వచ్చి అధికారులు విచారించారు. తను మరో కార్యక్రమానికి హాజరయ్యానని ఆమె బదులిచ్చారు. ఏ ఈవెంట్‌లో పాల్గొన్నారని ప్రశ్నించగా నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పుకొచ్చింది. కానీ పోలీసుల విచారణలో ఆమె సంబంధిత ఈవెంట్‌లో పాల్గొనలేదని తేలింది. దాంతో ఆ నటిని అమెరికాకు రప్పించిన వ్యక్తి గురించి ఆరా తీశారు. ఆ వ్యక్తి పేరు రాజు అని ఉంది. అతని గురించి విచారించగా కిషన్‌ అనే వ్యక్తే రాజు అనే మారుపేరుతో ఆమెను రప్పించాడని తేలింది. దీంతో ఆ నటి వీసాను రద్దు చేశారు. అలాగే మరో నలుగురి నటీమణులను కూడా విచారించారు. అరెస్టయిన కిషన్, ఆయన భార్య చంద్రకళ వద్ద ఈ హీరోయిన్లతో సంభాషణలు జరిపినట్లు ఆధారాలున్నాయని చెపుతున్నారు.