అతి చిన్న వయస్సులో నే మృతి చెందిన టాలీవుడ్ నటులు వీరే , వారెవరో చూడండి...  

Tollywood Celebs Who Died At A Very Tender Age-died At A Young Age,divya Bharti,pratyusha,soundarya,tollywood Celebs,uday Kiran

మన తెలుగు ప్రేక్షకులకి ఎవరి నటనైన నచ్చితే గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తారు , ఆ నటులు తెలుగు వార కాదా అని కూడా చూడరు అందుకే మన దేశం లో ఎక్కడలేని విధంగా డబ్బింగ్ సినిమాలు ఎక్కువగా ఆడే రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాలే. అలా తెలుగు సినిమాల్లో నటించి వారి నటనతో తెలుగు ప్రేక్షకుల మనస్సులో సుస్థిర స్థానం ఏర్పరచుకొని అతి చిన్న వయసులోనే చనిపోయిన కొందరు నటులు వీరే..

అతి చిన్న వయస్సులో నే మృతి చెందిన టాలీవుడ్ నటులు వీరే , వారెవరో చూడండి...-Tollywood Celebs Who Died At A Very Tender Age

1. యశో సాగర్

ఈ కర్ణాటక లో పుట్టి పెరిగి 2008 లో తెలుగు లో కరుణాకరన్ దర్శకత్వం లో ఉల్లాసంగా ఉత్సహంగా సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. తన మొదటి సినిమా తోనే తెలుగు వారి ని తన నటనతో కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. 2008 లో వచ్చిన సినిమాల్లో ఉల్లాసంగా ఉత్సహంగా సినిమా మంచి హిట్ గా నిలిచింది. తన రెండవ సినిమా mr. ప్రేమికుడు సినిమా చేస్తుండగానే 2012 డిసెంబర్ 25 న కార్ లో ముంబై నుండి బెంగుళూర్ వెళ్తుండగా యాక్సిడెంట్ లో మరణించాడు.

2. భార్గవి

భార్గవి వైవీఎస్ చౌదరి దేవదాస్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది..

తరువాత నాని నటించిన అష్టా చమ్మా సినిమాలో స్వాతి తో పాటు భార్గవి కూడా హీరొయిన్ గా నటించింది. ఈమె యాంకరింగ్ తో పాటు పలు సీరియల్స్ లో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అమ్మమ్మ.

కం టీవీ షో ఈమెకి బుల్లితెర పై బాగా పాపులారిటీ ని సంపాదించిపెట్టింది. 2008 డిసెంబర్ 16 న భార్గవి తన అపార్ట్మెంట్ లో చనిపోయి ఉంది ఆమెతో పాటు ఆర్కెస్ట్రా ఆపరేటర్ ప్రవీణ్ కుమార్ కూడా చనిపోయి ఉన్నాడు , అతను సూసైడ్ నోట్ లో భార్గవి తను పెళ్లి చేసుకున్నామని తనకి సినిమా ఆఫర్ లు రావడం వల్ల ఆమె వీడి పోవలనుకుందాని అందుకే ఆమెని చంపి ఆత్మహత్య చేసుకున్నాను అని ఆ లెటర్ లో రాసాడు.

3.అచ్యుత్

కునపరెడ్డి అచ్యుత్ వర ప్రసాద్ చాలా తెలుగు సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా చేసాడు , ఈయన చేసిన సినిమాల్లో తమ్ముడు సినిమా ఎప్పటికి గుర్తుండిపోతుంది , అందులో పవన్ కళ్యాణ్ కి అన్నయ్య గా నటించి మంచి ప్రసంశలు పొందాడు . అచ్యుత్ 100 కు పైగా సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు సూపరిచితుడు అయ్యాడు . డిసెంబర్ 26 , 2002 లో అచ్యుత్ గుండె పోటు తో మృతి చెందాడు..

4.దివ్య భారతి

దివ్య ఓం ప్రకాష్ భారతి ఈమె తెలుగు తో పాటు హిందీ సినిమాల్లో నటించి చాలా మంది అభిమానులని సంపాదించుకుంది. 16 ఏళ్ళ వయస్సులోనే 1990 లో బొబ్బిలి రాజా సినిమాలో వెంకటేష్ సరసన నటించింది. తరువాత తెలుగు లో చాలా సినిమాలు చేస్తూనే 1992 లో విశ్వాత్మ సినిమా తో బాలీవుడ్ కి పరిచయం అయింది.ఏప్రిల్ 5 1993 లో ముంబై లోని తన బిల్డింగ్ బాల్కనీ నుండి కింద పడిపోయి చనిపోయింది. ఆమెది హత్య అని పుకార్లు వచ్చిన దానికి సాక్ష్యం ఏమి లభించలేదు..

5. ప్రత్యుషా

ప్రత్యుషా తెలుగు చక్కగా మాట్లాడగల తెలుగు నటి , ఈమె 1988 లో రాయుడు సినిమాలో సహా నటిగా తెలుగు సినిమాకి పరిచయం అయింది. తరువాత శ్రీ రాములయ్య , సముద్రం ,స్నేహమంటే ఇదేరా ,కలుసుకోవాలని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది..

ఫిబ్రవరి 2002 లో విషం కలిపిన కోక్ తాగి చనిపోయింది. ఆమె ఆమె ప్రియుడు పెళ్లి చేసుకోవాలి అని పెద్దలకు చెప్తే ఒప్పుకోలేదని విషం తాగారు. ప్రత్యుషా ప్రియుడు సిద్దార్త్ రెడ్డి చికిత్స తరువాత బతికాడు కానీ ప్రత్యుషా అప్పటికే మరణించింది.

6. ఆర్తి అగర్వాల్

ఆర్తి అగర్వాల్ పగల్పన్ అనే సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అయింది తరువాత 16 ఏళ్ళ వయస్సులో నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాలో వెంకటేష్ పక్కన నటించి ఓవర్నైట్ స్టార్ అయిపోయింది. ఆర్తి అగర్వాల్ తెలుగు లో చిరంజీవి , బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు , నాగార్జున , తరుణ్ దాదాపు ప్రతి స్టార్ హీరో తో నటించింది.

కొన్నాళ్ళు సినిమాలకి దూరంగా ఉండి 2007 లో పెళ్లి చేసుకొని 2009 లో విడాకులు తీసుకుంది. తరువాత లావు ఎక్కువై ఒబేసిటీ తో బాధపడింది వైద్యం తీసుకుంటున్న సమయం లొనే జూన్ 6 2015 లో అమెరికా లో కనుమూసింది..

7. ఉదయ్ కిరణ్

ఉదయ్ కిరణ్ ఎవరి సహాయం లేకుండా కష్టపడి ఇండస్ట్రీ కి వచ్చి లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకొని హాట్రిక్ హిట్ లు కొట్టాడు. డైరెక్టర్ తేజ దర్శకత్వం లో చిత్రం సినిమా తో తెలుగు పరిశ్రమకి పరిచయం అయి మొదటి సినిమాకే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ని అందుకున్నాడు. తరువాత వచ్చిన నువ్వు నేను తెలుగు ఇండస్ట్రీ ని ఊపు ఊపింది.

నువ్వు నేను సినిమా తరువాత ఉదయ్ కిరణ్ ఇమేజ్ అమాంతం పెరిగింది. ఎంత ఎత్తుకు ఎదిగిన పడిన కెరటం లా ఉదయ్ సినిమా కెరీర్ కూడా అమాంతం కిందకి పడిపోయింది వరుస ప్లాప్ లు ఒకానొక దశలో ఉదయ్ కిరణ్ కి సినిమా ఛాన్స్ లు కూడా రాలేదు. జై శ్రీ రాం అనే సినిమాతో మళ్ళీ తనని ప్రూవ్ చేసుకోవాలని చూసాడు కానీ అది కూడా ప్లాప్ అవ్వడం తో డిప్రెషన్ లోకి వెళ్లిన ఉదయ్ కిరణ్ తన సొంత ఇంట్లో జనవరి 5 , 2014 లో ఆత్మ హత్య చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య తెలుగు ఇండస్ట్రీ తో పాటు తెలుగు ప్రజల్ని కూడా కన్నీరు పెట్టించింది..

8. సౌందర్య

సౌందర్య గారు తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుండిపోయే నటి ఆమె , 1993 లో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. తరువాత వెనుదిరిగి చూసుకోలేదు ఎలాంటి పాత్రలో అయిన ఇమిడిపోగల నటి ఆమె . తెలుగు వారు సౌందర్య ని వల్ల ఇంట్లో మనిషిలా అనుకునే వాళ్లంటే ఆమె తెలుగు ప్రజల మనస్సుల్లో ఎలాంటి స్థానం సంపాదించుకున్నారో అర్థమవుతుంది. అప్పటి స్టార్ హీరోలందరితో సినిమాలు తీసి హిట్లు కొట్టిన నటి.

సౌందర్య వెంకటేష్ సినిమాలు దాదాపు అన్ని హిట్ లే . సౌందర్య గారిని ఈ తరం సావిత్రమ్మ అనేవారు. తన 12 సంవత్సరాల తెలుగు సినీ కెరీర్ లో 114 సినిమాలు తీసింది. 2004 ఏప్రిల్ 17 న బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం బెంగళూరు నుండి ఆంధ్రప్రదేశ్ కి వస్తుండగా విమాన ప్రమాదంలో సౌందర్య గారు మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సౌందర్య మరణాన న్నీ జీర్ణించుకోలేకపోయారు. తెలుగు వారు గుండెల్లో సౌందర్య గారు ఎప్పటికి నిలిచిపోతారు.