బాహుబలి లాంటి గేమ్ చేంజర్ తర్వాత టాలీవుడ్ కి, టాలీవుడ్ స్టార్స్ కి, టాలీవుడ్ మూవీస్ కి, కంటెంట్ కి, టెక్నిషియన్స్ కు పాన్ ఇండియా అప్రోచ్ వచ్చింది.అందుకే టాలీవుడ్ హీరోల నుంచి డైరెక్టర్స్ వరకు చాలా మంది రీమేక్స్ తో పాటు ఒరిజినల్ మూవీస్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.అలా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు రెడీ అయిన యాక్టర్స్, డైరెక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
విజయ్ దేవరకొండ
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న లైగర్ మూవీ ద్వారా విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు.ఇందులో హీరోయిన్ గా అనన్యపాండే చేస్తుంది.
శాలినీ పాండే
అర్జున్ రెడ్డితో ఇటు టాలీవుడ్ మరియు పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ సంపాదించుకున్న శాలినీ.రణ్ వీర్ సింగ్ తో జయేష్ భాయ్ జోర్దార్ లో నటిస్తోంది.
గౌతమ్ తిన్ననూరి
తెలుగులో మాస్టర్ పీస్ ఇచ్చిన గౌతమ్.హిందీ వాళ్లకు అదే మాస్టర్ పీస్ ని ఇవ్వడానికి రెడీ అయిపోయాడు.షాహిద్ హీరోగా నటిస్తున్నాడు.
అడవి శేషు
మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ రియల్ లైఫ్ స్టోరీని మేజర్ ద్వారా చెప్పబోతున్నారు.ఇందులో లీడ్ రోల్ అడవి శేషు చేస్తున్నారు.
మహేష్ బాబు
అడవిశేషు హీరోగా చేస్తున్న మేజర్ సినిమాక మహేష్ బాబు ప్రొడ్యూసర్ గా చేస్తున్నాడు.
సమంతా
తెలుగు ఓటీటీలో సునామీ క్రియేట్ చేసిన ఫిల్మీ మ్యాన్ సిరీస్.సీజన్ 2లో సమంతా మేజర్ రోల్ చేసస్తుంది.
జూ.ఎన్టీఆర్
రాజమౌళి చేస్తున్న RRR సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ కు పరిచయం అవుతున్నాడు.
వివి వినాయక్
ఛత్రపతి సినిమాని బాలీవుడ్ లోకి రీమేక్ చేస్తున్నారు.ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్నాడు.
అశోక్
తెలుగులో అనుష్క నటించిన భాగమతి సినిమాను బాలీవుడ్ లోకి దుర్గమతిగా అశోక్ రీమేక్ చేశారు.అక్కడ ఓటీటీలో విడుదల అయ్యింది.కానీ అంతగా సక్సెస్ కాలేదు.