ఎప్పుడెప్పుడు పిల్లలు కంటారా అని అభిమానులు ఎదురుచూస్తున్న 4 జంటలు- Tollywood Celebs Who Are Not Yet Having Kids

tollywood celebs who are not yet having kids , samantha and naga chaitanya, ram charan,upasana, tollywood celebs, kids - Telugu Kids, Ram Charan, Samantha And Naga Chaitanya, Tollywood Celebs, Tollywood Celebs Who Are Not Yet Having Kids, Upasana

తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని యువ జంటలు అందరికి ఆదర్శంగా నిలవడమే కాకుండా చూడముచ్చటగా కూడా ఉంటాయి.ఉదాహరణకు మహేష్ బాబు అండ్ నమ్రత జంట.

 Tollywood Celebs Who Are Not Yet Having Kids-TeluguStop.com

వీళ్లిద్దరు ప్రేమించి పెళ్లిచేసుకొని ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులైనా కూడా మహేష్ ఇప్పటికి టైం దొరికితే తన ఫ్యామిలీతో ఫారెన్ చెక్కేస్తూ హాయిగా ఎంజాయ్ చేసి వస్తుంటాడు.ఇక వీళ్ళలాగే ప్రేమించి పెళ్లిచేసుకున్న నాగచైతన్య – సమంత జంట, రాంచరణ్ అండ్ ఉపాసన జంట కూడా ఒకరికొకరు ఎంతో ప్రేమగా వుంటూ రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకుంటూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా జంటలే ఉన్నాయి.అయితే.

 Tollywood Celebs Who Are Not Yet Having Kids-ఎప్పుడెప్పుడు పిల్లలు కంటారా అని అభిమానులు ఎదురుచూస్తున్న 4 జంటలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భార్యాభర్తలిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నా వాళ్ళకి ఒక అబ్బాయో అమ్మాయో పుడితే ఆ సంతోషం వేరేగా ఉంటుంది కదా.అయితే ఈ కాలంలో కొంతమంది ప్రేమించి పెళ్లిచేసుకున్నా గాని పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు.బాగా సెట్టిల్ అవ్వాలి, ఇంకా లైఫ్ ని మనం ఎం ఎంజాయ్ చేసాం.ఇంకొన్నాళ్ళు ఆగుదాం అంటూ చాలామంది యువ జంటలు పిల్లల్ని కనడం లేట్ చేస్తున్నారు.

వీరిలో కొంతమంది సెలబ్రిటీ జంటలు కూడా వున్నాయి.ఆ సెలబ్రిటీ జంటలు ఏవో ఇప్పుడొకసారి చూద్దాం.

రాంచరణ్ అండ్ ఉపాసన

ఈ లిస్ట్ లో ముందు వరసలో ఉన్నారు.రాంచరణ్ అండ్ ఉపాసన జంట.వీళ్ళకి పెళ్ళై దాదాపు 8 ఏళ్ళు గడిచిపోయింది.అయితే వీళ్ళింకా పిల్లల్ని ప్లాన్ చేసుకోలేదని చెప్తున్నారు.

ఉపాసనని పిల్లలకు సంబంధించిన ప్రశ్న ఎప్పుడడిగినా ఇంకా టైం ఉంది అంటూ చెప్పుకొస్తోంది.అయితే ఆ టైం వచ్చేది ఎప్పుడో మరి.దీనిపై మెగాస్టార్ చిరు స్పందన ఏంటో ఏమో తెలియదు గాని చిరు ఫ్యామిలీ అభిమానులు మాత్రం వారసుడు ఎప్పుడు వస్తాడు అంటూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.దీనిపై రామ్ చరణ్ కూడా ఎప్పు స్పందించలేదు.

సమంత అండ్ నాగచైతన్య

ఇక వీళ్ళలాగే సమంత అండ్ నాగచైతన్య జంట కూడా ఉంది.2017 లో ఒకటైన ఈ జంట, ఇంకా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.అంతేకాదు సమంత సినిమాలు హోస్టింగ్ అంటూ బిజీగా ఉంటె చైతన్య కూడా తన సినిమాల్లో తాను బిజీగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.అలా ఇద్దరు కెరియర్ లో ఫుల్ బిజీగా వున్నారు.

దాంతో ఒక పక్క కెరీర్ చూసుకోవాలి, మరోపక్క ఒకరినొకరు ప్రేమించుకోవాలి.ఇలాంటి టఫ్ టైం లో ఇంకా పిల్లలు వద్దనుకుంటున్నారు.ఇంకొక విషయమేంటంటే ఉపాసన అండ్ సమంత బెస్ట్ ఫ్రెండ్స్! మరి చూడాలి వీళ్ళ జంటలు మనకి ఎప్పుడు శుభవార్త చెప్తాయో.

వరుణ్ సందేశ్ అండ్ వితికా షేరు

ఇక ఈ లిస్ట్ లో వరుణ్ సందేశ్ అండ్ వితికా షేరుల జంట కూడా వుంది.వీళ్లిద్దరు చూడటానికి చూడముచ్చటగా ఉంటారు.ఒకరికొకరు ఫుల్ గా సపోర్ట్ చేస్కుంటూ ఉంటారు.

అయితే వీళ్ళు ప్రేమించి 2015 లో వివాహం చేసుకున్నారు.అంటే వీళ్ళకి పెళ్లై 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పిల్లల విషయంలో ఆలోచిస్తునేవున్నారు.

వీళ్ళు కూడా జీవితంలో బాగా స్థిరపడ్డాకే పిల్లల్ని కనాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని అనుకుంటున్నారట.ఇక వీళ్లిద్దరు బిగ్ బాస్ సీజన్ 3 లో చేసిన రచ్చ మాములుగా లేదు కదా.

నమిత అండ్ వీరేంద్ర చౌదరి

ఇక “సింహమంటే చిన్నోడే వేటకొచ్చాడే” అంటూ బాలయ్య బాబుతో చిందులేసిన హాట్ అండ్ బబ్లీ బ్యూటీ నమిత 2017 లో వీరేంద్ర చౌదరి అనే అతన్ని పెళ్లిచేసుకుంది.అలా వీళ్ళకి పెళ్ళై మూడేళ్లు అవుతున్నా గాని అప్పుడే పిల్లలు ఎందుకు అన్నట్టు ఉంటున్నారు.

అదండీ, ఇలా వీళ్ళందరూ అప్పుడే పిల్లలు ఎందుకులే అన్నట్టు ఉంటున్నా కానీ అభిమానులు మాత్రం బాగా తొందరపడుతున్నారు.అభిమానులే కాదులెండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తొందర పడుతూనే వుంటారు కానీ మన హీరోలకు తెలుసు కదా ఎప్పుడు ఎం చేయాలో.

#Upasana #Kids #TollywoodCelebs #SamanthaAnd #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు