65-70 ఏళ్లలోనూ హీరోలుగా దుమ్మురేపుతున్న యాక్టర్స్‌.. ఆయనైతే మరీ ఓల్డ్..?

సాధారణంగా 60-70 ఏళ్ల వయసు వచ్చాక హీరో రోల్స్‌లో ఏ యాక్టర్ కూడా పనికిరాడు అని చెప్పుకోవచ్చు.

ఆ ఏజ్ లో డాన్సులు, రొమాన్స్, ఫైటింగ్ వారికి సూట్ కాదు.

వారి చర్మం కూడా ముడతలు పడిపోయి ముసలి వాళ్ల లాగా కనిపిస్తారు.ఫాదర్, అంకుల్ లాంటి క్యారెక్టర్ రోల్స్‌కి మాత్రమే వారు ఉపయోగపడతారని చెప్పుకోవచ్చు.

కానీ కొంతమంది ఈ భావన తప్పు అని నిరూపిస్తున్నారు.వీరు ఏజ్-డిఫైయింగ్ లుక్స్‌తో 70 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోల వలే కనిపిస్తూ దుమ్మురేపుతున్నారు.

చాలా స్టైలిష్ గా డాన్సులు, ఫైటింగ్స్, రొమాంటిక్ సన్నివేశాలు చేస్తూ కుర్ర హీరోలు పోటీ చేస్తున్నారు.వాళ్ళు ఎవరో తెలుసుకుందాం.

Advertisement
Tollywood Celebs Who Are More Than 60 Rajinikanth Chiranjeevi Nagarjuna Details,

• రజనీకాంత్

రజనీకాంత్( Rajinikanth ) చాలా స్టైల్‌గా నటిస్తాడు.ఆయన మ్యానరిజం, సినిమాల్లోని వన్ లైనర్లు అందరినీ బాగా ఆకట్టుకుంటాయి.

ఇంటర్నేషనల్ లెవెల్‌లో రజనీకి ఫ్యాన్ ఫాలోవర్లు ఉన్నారు.ఈ సూపర్ స్టార్ వయసు ప్రస్తుతం 73 ఏళ్లు.

ఈ వయసులో ఉన్న మామూలు వ్యక్తులైతే రోజువారీ పనులు చేసుకోడానికే కష్టపడతారు.కానీ రజనీకాంత్ అదిరిపోయే ఫైట్ సీన్లు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఈ హీరో 50 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.రీసెంట్‌గా జైలర్, లాల్ సలాం సినిమాలతో ఆకట్టుకున్నాడు.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?

ప్రస్తుతం వెట్టయన్, కూలీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు.

Tollywood Celebs Who Are More Than 60 Rajinikanth Chiranjeevi Nagarjuna Details,
Advertisement

• చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) వయసు అక్షరాలా 69 ఏళ్లు. చిరు ఏ హీరో కూడా సాధించనన్ని ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ సాధించాడు.ఇండియన్ సినిమా ముఖచిత్రాన్ని మార్చేశాడు.

భారతీయ చలనచిత్ర రంగానికి బ్రేక్ డాన్స్‌లు నేర్పించాడు.హీరో స్టాండర్డ్స్ బాగా పెంచేసాడు.2023లో "వాల్తేరు వీరయ్య" సినిమాతో ఓ సూపర్ హిట్ అందుకున్నాడు.ఇందులో చిరు వేసిన డాన్స్ స్టెప్పులకు అందరూ ఆశ్చర్యపోయారు.

ఈ వయసులో కూడా అంత ఎనర్జీతో ఎలా డాన్స్ చేస్తున్నావ్ బాసూ అని చాలామంది పొగిడారు కూడా.ఇప్పుడు ఈ మెగాస్టార్ విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు.

• నాగార్జున

అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) వయసు ప్రస్తుతం 65 ఏళ్లు. అయినా సరే సిక్స్ ప్యాక్ బాడీ మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకు పోటీగా రొమాంటిక్ సీన్లు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఈ మన్మథుడి వయసును దేవుడు ఆపేసాడేమో అనిపించేలాగా నాగార్జున కనిపిస్తున్నాడు.

• బాలకృష్ణ

సాధారణంగా వయసు పైబడే కొద్దీ అందరూ అలసిపోతారు.కానీ నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) మాత్రం రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు.యాక్షన్స్ సన్నివేశాలలో అదరగొడుతున్నారు.

ఈ వయసులోనూ హ్యాట్రిక్ హిట్స్ సాధించి రికార్డు సృష్టించారు.ఈ హీరో ఏజ్ ప్రస్తుతం 64 ఏళ్లు.

• కమల్ హాసన్

ఇటీవల లోక నాయకుడు కమల్ హాసన్( Kamal Haasan ) కల్కి 2898 AD, ఇండియన్ 2 సినిమాలతో ఆకట్టుకున్నాడు.ఇండియన్ 3, థగ్ లైఫ్ మూవీస్ లో హీరోగా చేస్తున్నాడు.ఆయన వయసు ఇప్పుడు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు, కమల్‌ హాసన్‌కి ఇటీవల 69 ఏళ్లు తగిలాయి.

ఈ ఏజ్ లో కూడా సోలోగా స్క్రీన్ ని షేక్‌ చేస్తున్నాడు.

తాజా వార్తలు