ఈ సినిమా న‌టులంతా వైసీపీలోకి జంపేనా..!     2017-01-11   02:26:00  IST  Bhanu C

2014లో టీడీపీకి బాగా కలిసొచ్చిన సినీ గ్లామ‌ర్‌పై వైసీసీ అధినేత జ‌గ‌న్ దృష్టిసారించారు. పార్టీకి సీనీగ్లామర్‌ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు వైపు బాల‌య్య‌, ముర‌ళీమోహ‌న్‌, క‌విత.. మ‌రోప‌క్క జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఇలా టీడీపీకి ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. త‌మ పార్టీలో రోజా మిన‌హా ఇత‌ర సినీ న‌టులు లేక‌పోవ‌డంతో జ‌గ‌న్‌.. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. టీడీపికి పూర్తిగా మద్ధతు తెలుపుతున్న వారిని కాకుండా.. తటస్థంగా ఉండి.. రాజకీయాలపై ఆసక్తి ఉన్న నటులను పార్టీలోకి ఆహ్వానించేందుకు వైసీపీ నాయకత్వం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

సినిమాల‌కూ రాజ‌కీయాల‌కూ ద‌గ్గ‌ర సంబంధ‌మే ఉంది. సినీ న‌టులు ఏదో ఒక పార్టీ త‌ర‌ఫున పోటీ చేయ‌డం, లేదా వారి త‌ర‌ఫున ప్ర‌చారంలో పాల్గొన‌డం ఏపీ రాజ‌కీయాల్లో స‌ర్వ‌సాధార‌ణ‌మే! సినీ గ్లామర్‌తో దూసుకుపోతున్న టీడీపీని అదే సినీగ్లామర్‌తో ఎదుర్కోవాలని వైసీపీ నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే పార్టీలోఉన్న రోజా, విజయ్‌చందర్‌ మినహా టాలీవుడ్‌ నటులు ఆ పార్టీకి అంటీముట్టనట్టే ఉంటున్నారు.

ఇందులో భాగంగా హాస్యనటి హేమతో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. కాపుల‌కు టీడీపీ ప్ర‌భుత్వం చేసిందేమీ లేద‌ని సీఎం చంద్ర‌బాబుపై విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమెను త‌మ పార్టీ వైపు తిప్పుకోవాల‌ని జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అలాగే కాపు పెద్ద, సినీ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌తోనూ నేత‌లు అంత‌ర్గ‌తంగా చ‌ర్చిస్తున్నారు. వీరితో పాటు జ‌గ‌న్‌కు నాగార్జున‌తోనూ స‌త్సంబంధాలున్నాయి. ఇక త‌మ బంధువు మోహ‌న్‌బాబును కూడా పార్టీలో చేర్చుకుని సినీగ్లామ‌ర్ పెంచుకోవాల‌ని జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌.

గత ఎన్నికల్లో టీడీపీకి కలిసొచ్చిన సినీగ్లామర్‌..ఆ పార్టీని అధికారానికి చేరువ చేసిందని వైసీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. పార్టీలో స్టార్‌ అట్రాక్షన్ బాలయ్యతోపాటు.. కొత్తగా పవన్‌ గ్లామర్‌ తోడవడంతో చంద్రబాబుకు తిరుగేలేకుండా పోయిందని వైసీపీ అభిప్రాయపడుతోంది. అందుకే తమ పార్టీలోనూ సినీ గ్లామర్‌ పెంచెందుకు వైసీపీ అధినేత జగన్‌ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.