డబ్బెంతైనా ఫర్వాలేదు.. లగ్జరీ కార్లు కొన్నామా? లేదా? అంటున్న సినీ సెలబ్రిటీలు..

సెలబ్రిటీలు అంటేనే కొత్తగా ఆలోచిస్తారు.కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాటిని వెంటనే సొంతం చేసుకుంటారు.

 Tollywood Celebs Buying Luxary Cars Details, Celeb Cars, Tollywood Top Celebriti-TeluguStop.com

కొత్త పనులు చేస్తూ అభిమానుల చేత వారెవ్వా అనిపించుకుంటారు.ఏదైనా నచ్చితే చాలు దాన్ని ఇంటికి తెచ్చేసుకుంటారు.

డబ్బు ఎంతైనా కానివ్విండి.అనుకున్నది దొరికిందా? లేదా? అంతే ముచ్చట.టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు.బెంజె లేటెస్ట్ వర్షన్.మెర్సిడెస్ మేబాచ్ జీ.ఎల్.ఎస్ -600 కారుపై పలువురు సినిమా తారలు మనసు పారేసుకున్రు.ఎలాగైనా ఆ కారును దక్కించుకోవాలి అనుకున్నారు.

ఆ కోరికను తీర్చుకున్నారు.అయితే ఈ కారును కొనుగోలు చేసిన తొలి తెలుగు నటుడిగా మాత్రం రాంచరణ్ నిలిచాడు.

నిజానికి ఈ కారును రామ్ చరణ్ కోసం స్పెషల్ గా డిజైన చేశారు.ఈ మార్పుల కోసం ఆయన అదనంగా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేవాడు.

ఇప్పటికే చరణ్ గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు ఉన్నాయి.ఫెరా, బీఎమ్ డబ్ల్యూ కార్లు కొలువుదీరాయి.

అటు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ కూడా కార్లు అంటే మహా పిచ్చి.ఈ ఏడాది జూలైలో లోనే మెర్సిడెస్ మేబాక్ ని కొనుగోలు చేశాడు.

ఈ కారు ఇండియాలో లాంఛ్ అయిన నెలలోనే ఆయన దక్కించుకున్నాడు.దేశంలో ఈ కారు కొనుగోలు చేసిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సాధించాడు.

Telugu Arjun Kapoor, Benz Car, Bunny, Celeb Cars, Kriti Sanon, Lamborghini Car,

అటు అర్జున్ కపూర్ ఈ ఖరీదైన జర్మనీ ఇంపోర్టెడ్ కారుని దక్కించుకున్నాడు.ఆయుష్మాన్ ఖురానా కూడా జులై లోనే మెర్సిడెస్ మేబాచ్ న్యూ మోడల్ ను తీసుకున్నాడు.అటు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూడా ఇదే బ్రాండ్ కారును దక్కించుకుంది.అటు టాలీవుడ్ స్టార్ హీరోలకి లంబోర్ఘీని అంటే కూడా చాలా ఇష్టం.ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్, బన్నీ ఈ కారును కొనుగోలు చేశారు.డబ్బు ఎంతైనా ఫర్వాలేదు.

కారు కొన్నామా? లేదా? అనేదే ముఖ్యం అంటున్నారు టాప్ సెలబ్రిటీస్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube