దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్న సినీ స్టార్స్..

కాలం చిత్ర విచిత్రాలు చేస్తుంది.అవకాశం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి.

 Tollywood Celebs And Their Business , Rana, Visual Effects Company, Vijay, Funct-TeluguStop.com

అవకాశాలు వస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలి.సినిమా రంగం అనేది నిలకడ లేనిది.

ఎప్పుడు అవకాశాలు వస్తాయో? ఎప్పుడు రాకుండా పోతాయో? చెప్పడం కష్టం.అందుకే.

వీలున్నప్పుడే అందినకాడికి దండుకోవాలి.ఆ తర్వాత హాయిగా జీవితాన్ని గడపాలి.

సేమ్ ఇదే పద్ధతిని పాటిస్తున్నారు సినిమా తారలు.వెండితెరపై వెలుగు వెలుగుతుండగానే.వ్యాపారాల్లోకి అడుగు పెడుతున్నారు.ఒకప్పుడు నార్త్ కే పరిమితం అయిన ఈ పద్దతి.ప్రస్తుతం సౌత్ లోనూ విస్తరించింది.ఇప్పటికే పలు యాడ్స్ తో పాటు సొంత బ్రాండ్లతో మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు.

కొందరు హోటల్స్, మరికొందరు రెస్టారెటంలు, ఇంకొందర్లు సెలూన్లు, మిగతా కొందరు జ్యువెలర్స్, ఇంకా కొందరు జిమ్స్ రంగంలోకి దిగుతున్నారు.సౌత్ లో టాప్ రెస్టారెంట్లు సినిమా తారలవే కావడం విశేషం.

టాలీవుడ్ టాల్ హీరో రానా బిజినెస్ లో బాగానే రాణిస్తున్నాడు.విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీతో పాటు క్వాన్ అనే టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ కూడా రన్ చేస్తున్నాడు.

అంతేకాదు.సెలబ్రిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రానా డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.

అటు తమిళ స్టార్ దళపతి విజయ్ కి చెన్నైలో భారీగా కల్యాణమండపాలు ఉన్నాయి.విజయ్ తల్లి పేరు మీద చాలా ఫంక్షన్ హాల్స్ నెలకొల్పాడు.

టాలీవుడ్ యంగ్ యాక్టర్ సందీప్ కిషన్ సినిమా హీరో మాత్రమే కాదు.బిజినెస్ మ్యాన్ కూడా.

హైదరాబాద్, సికింద్రాబాద్ లో వివాహ భోజనంబు పేరుతో పలు రెస్టారెంట్లు రన్ చేస్తున్నాడు.

Telugu Halls, Rana, Sandeep Kishan, Tamanna, Vijay, Visualeffects, Vivahabojanam

అటు టాలీవుడ్ క్యూట్ బ్యూటీ తమన్నా కూడా బిజినెస్ లో బాగానే రాణిస్తుంది.వైట్ అండ్ గోల్డ్ పేరుతో జ్యువెలరీ బ్రాండ్‌ కలిగి ఉంది.ఈ ఆన్‌లైన్ జ్యువెలరీ బ్రాండ్ నుంచి భారీగా డబ్బులు సంపాదిస్తుంది ఈ మిల్కీ బ్యూటీ.

అటు మహానటి కీర్తి సురేష్ సైతం బిజినెస్ రంగంలో బాగానే రాణిస్తుంది.తన మిత్రులతో కలిసి స్కిన్‌ కేర్‌ బ్రాండ్ల తయారీలో అడుగు పెట్టింది.సక్సెస్ ఫుల్ గా బిజినెస్ కొనసాగిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube