సీనియర్ జర్నలిస్ట్ మృతి... విషాదంలో తెలుగు సినీ పరిశ్రమ...  

tollywood celebrity\'s reacts about senior journalist ramarao death - Telugu Mohan Babu, Pawan Kalyan, Ramarao Dead, Ramarao Death, Ramarao Death News, Tollywood News, Vijay Dewarakonda

తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు మరణించిన సంగతి తెలిసిందే.దీంతో  సినీ పరిశ్రమలోని పలువురు సినీ పెద్దలు మరియు సెలబ్రిటీ హీరోలు రామారావు కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Tollywood Celebrity's Reacts About Senior Journalist Ramarao Death

ఇందులో భాగంగా టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ రామారావు మరణం పట్ల స్పందించారు.ఇందులో భాగంగా సీనియర్ జర్నలిస్టు రామారావు మరణం సినీ పరిశ్రమకి తీరని లోటని తనను రామారావు మరణ వార్త తనని దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.

అంతేకాక తన కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.

అలాగే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రామా రావు మృతి పట్ల స్పందిస్తూ సీనియర్ జర్నలిస్ట్ రామారావు అకాల మరణం తనని ఎంతో బాధకి గురి చేసిందని అన్నారు.అంతేగాక చిన్నప్పటి నుంచి తనకు వ్యక్తిగతంగా రామారావు గారితో మంచి పరిచయం ఉందని ఆయన మరణవార్త విన్న వెంటనే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.అలాగే తన కుటుంబానికి అవసరమైతే తన వంతు సాయం చేస్తూ అండగా నిలుస్తానని అన్నారు.

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా  సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు మృతి పై స్పందించారు.రామారావు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని అన్నారు.అంతేకాక సినీ పరిశ్రమకి తాను చేసిన సేవలు మరువలేనివని ఈ కారణంగా రామారావు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు.రామారావు గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.

#Mohan Babu #Ramarao Death #Pawan Kalyan #Ramarao Dead

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Celebrity's Reacts About Senior Journalist Ramarao Death Related Telugu News,Photos/Pics,Images..