మాతృత్వం అనేది దేవుడిచ్చిన వరం. అమ్మ అని పిలిపించు కోవడానికి ప్రతి తల్లి ఎంతగానో ఎదురుచూస్తుంది.
ఒక్క అమ్మ మాత్రమే కాదు.నాన్న అనే పిలుపు కోసం ప్రతి మగాడు ఎదురు చూస్తాడు.
కానీ మన సభ్య సమాజంలో మగాడి కన్నా పిల్లలు పుట్టని ఆడవాళ్ళ పరిస్థితి మరి ఘోరంగా ఉంటుంది కదా.పెళ్లయి పిల్లలు ఉన్న స్త్రీలనే పెళ్లిళ్లు, పేరంటాలు, ఏదన్నా శుభకార్యాలకు పిలుస్తారు.అలాగే ఏదన్నా ఏదైనా మంచి పని చేసేటప్పుడు వాళ్ళని పిలుస్తూ ఉంటారు.అలాగే పిల్లలు లేని మహిళలను కించపరుస్తూ, సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉంటారు.పిల్లలు లేని మహిళలను గొడ్రాలు అనే పేరుతో కూడా పిలుస్తారు.ఇప్పటికీ మన సమాజంలో పిల్లలు లేని ఆడవాళ్లను, భర్త మరణించిన స్త్రీలను ఎన్నో ఎత్తిపొడుపు మాటలతోటి దూషిస్తునే ఉంటారు.
అయితే ఇలా పిల్లలు లేని ఆడవాళ్లను దూషించడం ఎక్కడో ఒకచోట కామన్ అయిపొయింది.బాగా డబ్బు ఉన్న స్త్రీలను కానీ లేదంటే సినిమా రంగంలో ఉన్న ఆడవాళ్ళని కానీ అంత పెద్దగా పట్టించుకోరు అనే చెప్పాలి.
అలా కాకుండా పల్లెటూరు లో బ్రతికే ఆడవాళ్ళు మాత్రం ఇప్పటికి సమాజంలోని వారితో మాటలు పడుతున్నారు.అయితే సినిమా రంగంలో ఉండి, ఒక వెలుగు వెలిగిన కొంతమంది నటి నటీమణులకు సంతాన భాగ్యం లేదు.
మరి ఆ సెలబ్రిటీస్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం.
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ జంట ఎవరంటే ముందుగా మనకి గుర్తుకువచ్చేది కృష్ణ -విజయనిర్మల దంపతులు.
కానీ కృష్ణ విజయ నిర్మలను రెండవ పెళ్లి చేసుకున్నాడు.సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవికి పిల్లలు ఉన్నారు కానీ, ఎంతో ప్రేమించి రెండవ భార్యగా పెళ్లి చేసుకున్న విజయ నిర్మలకు మాత్రం పిల్లలు లేరు.
కానీ విజయనిర్మలకి తన మొదటి భర్త ద్వారా సీనియర్ నరేష్ పుట్టాడు.అలాగే విజయనిర్మల – కృష్ణ దంపతులకు మాత్రం పిల్లలు లేరు.
వీరిరువురు పిల్లలు వద్దు అనుకున్నారో లేదంటే పిల్లలు పుట్టలేదో అన్న విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.ఈ దంపతులకు కూడా ఒక బిడ్డ ఉంటే బాగుండేదని పలువురు అభిమానులు ఇప్పటికీ బావిస్తూనే ఉంటారు.
అలాగే కృష్ణం రాజు దంపతులకు కూడా ఎంతో కాలం పిల్లలు లేరు.ఎన్నో ఏళ్ల సంవత్సరాల తర్వాత పలు పరిమాణాల ద్వారా పిల్లలు జన్మించారు.
అంతకాలం వరకు ప్రభాస్ నే కృష్ణంరాజు తన వారసుడిగా, తన బిడ్డగా భావించారు.అంతేకాదు సినీ ఇండస్ట్రీలో చాలా మంది సెలెబ్రెటీలకు పిల్లలకు లేరు.
మధు బాల కిషోర్ కుమార్ దంపతులకు కూడా పిల్లలు జన్మించలేదు.కమాన్ అబ్రోహి, మీనా కుమారికి కూడా సంతాన భాగ్యం లేదు.ఈ జాబితాలో నటుడు దిలీప్ కుమార్, సైరాలు కూడా ఉన్నారు.అలాగే సాధన, ఆర్కే నాయక్ ల దంపతులకు కూడా సంతాన భాగ్యం లేదు.ఆశబోమ్సలే – అర్జీ బర్మన్, బిఆర్ ఇస్రానా –రెహ్న సుల్తానా, జావేద్ -అక్తర్, అనుపమ్ ఖేర్ -కిరణ్ ఖేర్, అలాగే సంగీత బిలాని., డోలు అహ్లీవాలియా –కమల్ వారి వంటి దంపతులకు కూడా పిల్లలు లేకపోవడంతో ఎంతో మదన పడేవారు.
ఇలా కోట్ల ఆస్తులు, పేరు ప్రఖ్యాతలు ఉన్నాగాని వారికీ సంతానం లేకపోవడం అనేది ఒక లోటు అనే చెప్పాలి.సినిమా రంగంలో తమ వారసులను పరిచయం చేసే అదృష్టం లేకపోవడంతో అంతా మన చేతిలో ఏమి లేదని, అంతా విధాత అయిన ఆ దేవుడి చేతిలోనే ఉంది అన్నా విషయం అర్ధం అవుతుంది కదా.