మరోసారి ఐక్యత చాటిన టాలీవుడ్ సెలబ్రిటీలు  

Tollywood Celebrities Light Lamps In Fight Against Corona Virus - Telugu Megastar, Telugu Cinema,, Tollywood Industry

కరోనా విపత్కర పరిస్థితిలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఓ వైపు ప్రభుత్వానికి అండగా ఉంటూ కోట్ల రూపాయిలు విరాళాలుగా ఇచ్చారు.హీరోల నుంచి, దర్శకులు, నిర్మాతల వరకు అందరూ ముందుకొచ్చి కరోనాపై జరుగుతున్నా పోరాటంలో తమవంతు సాయం అందించారు.

 Tollywood Celebrities Light Lamps In Fight Against Corona Virus

అక్కడితో ఆగకుండా ఇలాంటి విపత్కర పరిస్థితిలో సినీ కార్మికుల కష్టం గుర్తించి వారిని ఆదుకోవడానికి ఒక చారిటీ ఏర్పాటు చేసి విరాళాలు ఇచ్చారు.ఎప్పుడు కూడా ప్రకృతి విపత్తుల సమయంలో ఇతర భాషా హీరోల గురించి గొప్పగా చెప్పుకునే మనం ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమ అంతా ఏకతాటిపై నిలవడం చూస్తున్నాం.

ఇలాంటి సమయంలో ప్రభుత్వం సూచనలు ప్రజలకి చేరవేయడంలో కూడా మన సెలబ్రిటీలు ముందు వరుసలో ఉన్నారు.ఎప్పటికప్పుడు వీడియోలు తీస్తూ ప్రజలకి సోషల్ మీడియాలో పెడుతూ ప్రజలకి అవగాహన పెంచుతున్నారు.

ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలంతా దీపపు జ్యోతులని వెలిగించారు.9 నిమిషాల పాటు ఈ దీపాలను వెలిగించి కరోనా చీకట్లను తరిమికొట్టారు.ఐక్యతను చాటుకున్నారు.సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా దీపాలు వెలిగించారు.మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి ఇంటి ముందు దీపాలు పట్టుకుని నిలబడ్డారు.

అలాగే, స్టైలిష్ అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో దీపాలు వెలిగించారు.అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు.

విక్టరీ వెంకటేష్ దీపాలను లాంథర్‌లో పట్టుకుని బాల్కనీలోకి వచ్చారు.నాగార్జున తన భార్య అమల, కుమారుడు అఖిల్‌తో కలిసి దీపాలను వెలిగించారు.

మహేష్ బాబు కూడా దీపం వెలిగించారు.పవన్ కళ్యాణ్ కూడా దీపపు జ్యోతిని వెలిగించి తమ మద్దతు ప్రకటించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు