జగన్ తోనే దోస్తీ అంటున్న సినిమా నటులు! పవన్ కళ్యాణ్ నష్టం ఉంటుందా  

వైసీపీలోకి క్యూ కడుతున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు..

Tollywood Celebrities Join Ysrcp-janasena,jeevitha,rajasekhar,tdp,tollywood Celebrities,ysrcp

 • ఏపీ రాజకీయాలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో తమ వ్యూహ ప్రతి వ్యూహాలతో దూసుకుపోతున్నారు. ఓ వైపు అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ చతురతతో వ్యూహాత్మక రాజకీయాలకి తెరతీసి వైసీపీని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

 • జగన్ తోనే దోస్తీ అంటున్న సినిమా నటులు! పవన్ కళ్యాణ్ నష్టం ఉంటుందా-Tollywood Celebrities Join YSRCP

 • అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం తనని తాను ప్రజల్లో కి ఫోకస్ చేసుకోవడానికి ప్రయారిటీ ఇస్తున్నాడు. సినిమా నటులని, అలాగే రాజకీయాలలో క్రియాశీలకంగా లేని వారిని తన పార్టీలోకి ఆహ్వానిస్తూ వారంతా తన మీద నమ్మకంతో వస్తున్నారు అని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

 • జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ రాజకీయాలలో తన సత్తా చాటడానికి ప్రయత్నిస్తూ ఉంటే అతనిని నిలువరించడానికి అన్నట్లు సినిమా నటులకి వైసీపీ అధినేత జగన్ తన పార్టీలోకి ఆహ్వానస్తున్నారు. పార్టీలో చేరితే సముచిత స్థానం ఇస్తామని చెబుతూ వారితో సంప్రదింపులు జరిపి పార్టీలోకి తీసుకుంటున్నారు.

 • ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా కూడా వైసీపీ చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కమెడియన్ పృథ్వి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రమ్యశ్రీ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు జగన్ వైపు వెళ్ళగా, కొద్ది రోజుల క్రితం జయసుధ, అలాగే మంచు మోహన్ బాబు కూడా వైసీపీలో చేరిపోయారు.

 • తాజాగా హీరో రాజశేఖర్, నటి హేమ, యాంకర్ శ్యామల వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

  Tollywood Celebrities Join YSRCP-Janasena Jeevitha Rajasekhar Tdp Tollywood Ysrcp

  అలాగే చిన్నికృష్ణ లాంటి రచయిత కూడా వైసీపీ తీర్ధం తీసుకున్నారు. వైసీపీలోకి వెళ్ళిన నటులు, సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ జగన్ అధికారంలోకి వస్తాడని పొగిడేస్తూ, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారు.

 • గతంలో వైసీపీని వీడి జగన్ కి అహంకారం ఎక్కువ అంటూ విమర్శించిన జీవిత, రాజశేఖర్ మళ్ళీ వైసీపీ కండువా కప్పుకొని అవన్నీ గతం అంటూ కొత్త పల్లవి అందుకుంది. అదే టైంలో పవన్ కళ్యాణ్ ఆలోచన మంచింది కాదని, నియంతృత్వ ఆలోచనలు ఎక్కువ అని ఎవరిని లెక్కచేయని మనస్తత్వం అంటూ చెప్పుకొచ్చింది.

 • అయితే వీరి వలన వైసీపీకి లసిసోచ్చే లాభం కాని పవన్ కళ్యాణ్ కి కలిగే నష్టం కాని ఏమీ ఉండదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.