డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలకి క్లీన్ చీట్! ఎవరికి తెలియకుండా ఎలా  

డ్రగ్స్ రాకెట్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలకి క్లీన్ చీట్ .

Tollywood Celebrities Have Clean Cheat In Drugs Case-hyderabad Drugs Racket,telugu Cinema,tollywood Celebrities Have Clean Cheat

గత ఏడాది ఆరంభంలో టాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ ఎంత సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో చాలా మంది సెలబ్రిటీలని అప్పటి సిట్ బృందం విచారణ జరిపింది. అకున్ సబర్వాల్ నేతృత్వంలో విచారణ పూర్తి స్థాయిలో చేసి టాలీవుడ్ లో కొంతమందికి డ్రగ్స్ మాఫియాతో నేరుగా సంబంధాలు ఉన్నాయని మీడియా ముఖంగా తెలియజేసారు..

డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలకి క్లీన్ చీట్! ఎవరికి తెలియకుండా ఎలా -Tollywood Celebrities Have Clean Cheat In Drugs Case

ఇక ఈ టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ పరువు కూడా రోడ్డు మీదకి వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ వ్యవహారం మరో సారి హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణంగా డ్రగ్స్ కేసులలో టాలీవుడ్ లో విచారణ ఎదుర్కొన్న అందరికి సిట్ క్లీన్ చీట్ ఇచ్చినట్లు బయటకి వచ్చింది.

డ్రగ్స్ వ్యవహారంపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా డ్రగ్స్ రాకెట్ కేసుపై వివరాలు సేకరించారు. ఈ సమాచారం ప్రకారం డ్రగ్స్‌ కేసులో ఇప్పటి వరకు నాలుగు ఛార్జిషీట్ల దాఖలు చేసినట్లు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. మొత్తం 12 కేసులు నమోదు చేశామని, సినీనటులు, దర్శకులు సహా 62 మందిని ఈ కేసులో విచారించినట్లు తెలిపారు. అయితే సిట్ అధికారులు టాలీవుడ్ ప్రముఖుల పేర్లను మాత్రం ఛార్జిషీట్‌లో చేర్చలేదని అధికారులు వెల్లడించిన సమాచారం ద్వారా తెలుస్తోంది.

మరి వీరికి ఎలా క్లీన్ చీట్ ఇచ్చింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.