ఏప్రిల్ లో బర్త్ డే జరుపుకుంటున్న సెలబ్రిటీలు వీళ్లే..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏప్రిల్, మే నెలలు ఎంతో స్పెషల్ అనే సంగతి తెలిసిందే.సమ్మర్ సీజన్ కావడంతో ఈ రెండు నెలల్లో సినిమాలను విడుదల చేయడానికి యంగ్, మిడిల్ రేంజ్ హీరోలతో పాటు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతారు.

 Tollywood  Celebrities Birthday List In April Month, Swathi Reddy, Akhil, Allu A-TeluguStop.com

టాలీవుడ్ కు ఎంతో కీలకమైన ఏప్రిల్ నెలలో చాలామంది సెలబ్రిటీల పుట్టినరోజులు ఉన్నాయి.టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ ఏప్రిల్ 8వ తేదీన పుట్టినరోజును జరుపుకోనున్నారు.

ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.స్టార్ హీరోయిన్ సమంత ఏప్రిల్ నెల 28వ తేదీన పుట్టినరోజును జరుపుకోనున్నారు.

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన జయప్రద ఏప్రిల్ 3వ తేదీన పుట్టినరోజును జరుపుకోనున్నారు.ప్రతిభ పుష్కలంగా ఉన్న నటిగా గుర్తింపును సంపాదించుకున్న నిత్యామీనన్ ఏప్రిల్ 8వ తేదీన పుట్టినరోజు జరుపుకోనున్నారు.

తెలుగులో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న సిమ్రాన్ ఏప్రిల్ 4వ తేదీన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.హీరోగా, దర్శకునిగా, కొరియోగ్రాఫర్ గా గుర్తింపును సంపాదించుకున్న ప్రభుదేవా ఏప్రిల్ 3వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

తెలుగులో యాంకర్ గా కెరీర్ ను మొదలు పెట్టి విజయాలను సొంతం చేసుకున్న స్వాతిరెడ్డి ఈ నెల 9వ తేదీన పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు.

Telugu Akhil, Allu Arjun, April Birthdays, Jayaprada, Samantha-Movie

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ నెల 7వ తేదీన పుట్టినరోజు జరుపుకోనున్నారు.హీరో సిద్దార్థ్ తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో సైతం నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.సిద్దార్థ్ ఈ నెల 17న పుట్టినరోజు జరుపుకోనున్నారు.

యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తుండగా ఏప్రిల్ 8వ తేదీన అఖిల్ పుట్టినరోజు జరుపుకోనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube