గ్రేటర్‌కు టాలీవుడ్ దూరం... తెర‌వెన‌క ఏం జ‌రిగింది..!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారం దుమ్ము రేగుతోంది.ఎవ‌రికి వారు ప్ర‌తిస్టాత్మకంగా తీసుకుని పార్టీలు ఇక్క‌డ ప్ర‌చారం చేస్తున్నాయి.

 Tollywood Avoid Ghmc Elections Campaign,hyderabad,tollywood,ghmc,tollywood Heroe-TeluguStop.com

బీజేపీ దూకుడు.మామూలుగా లేద‌నే ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతోంది.

అదేస‌మ‌యంలో అధికార టీఆర్ఎస్ కూడా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది.ఇక‌, కాంగ్రెస్ పార్టీ దూకుడు లేక‌పోయినా.

సైలెంట్ ప్రచారం బాగానే చేస్తోంది.మ‌రోపార్టీ ఎంఐఎం.

నాయ‌కులు వివాదాస్ప‌ద కామెంట్ల‌తో మ‌షాలాను బాగానే ద‌ట్టిస్తున్నారు.ఇలా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారం భారీ రేంజ్‌లో సాగుతోంది.

అయితే.ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆస‌క్తికర విష‌యం వెలుగు చూసింది.

అదేంటంటే.టాలీవుడ్‌.

ఎప్పుడు గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌రిగినా.టాలీవుడ్ నుంచి ప‌లువురు ప్ర‌ముఖులు ఏదో ఒక పార్టీకి ప్ర‌చారం చేస్తుంటారు.కొంద‌రు జూనియ‌ర్ ఆర్టిస్టులు సైతం వ‌స్తుంటారు.అయితే.

ఈ ద‌ఫా మాత్రం ఒక్క‌రు కూడా ప్ర‌చారానికి రాలేదు.అంతేకాదు.

క‌నీసం గ్రేట‌ర్ గురించి ఆన్‌లైన్ ప్ర‌చారం కూడా చేయ‌డం లేదు.గ‌తంలో చాలా మంది ఆర్టిస్టులు.

ఒక‌రిద్ద‌రు నాయ‌కులు.ముఖ్యంగా బ‌న్నీ వంటివారు కేసీఆర్ త‌రపున ఆన్‌లైన్ ప్ర‌చారం చేశారు.

ఈ ద‌ఫా మాత్రం ఎవ‌రూ ముందుకు రాలేదు.దీనికి కార‌ణాలేంటి? అనే విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది.

Telugu Ghmc, Hyderabad, Latest, Tollywood, Toufg-Political

ఇటీవ‌లే కేసీఆర్‌తో టాలీవుడ్ ప్ర‌ముఖులు భేటీ అయ్యారు.త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొన్నారు.ఆయ‌న వాటి ప‌రిష్కారానికి వెంట‌నే ప‌చ్చ‌జెండా ఊపేశారు.ఈ ప‌రిణామాల అనంత‌రం.గ్రేట‌ర్ ఫైట్ రంగు మారుతుంద‌ని.టాలీవుడ్ ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని ఊహాగానాలు వ‌చ్చాయి.

నిజానికి టాలీవుడ్ అంతా కూడా టీఆర్ఎస్‌ కు అనుకూలంగా ఉంది.కొవిడ్ అనంత‌రం.

షూటింగుల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డంలోను, సినిమా హాళ్ల కరెంటు బిల్లుల‌ను మాఫీ చేయ‌డంలోను కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

Telugu Ghmc, Hyderabad, Latest, Tollywood, Toufg-Political

ఇటీవ‌ల కూడా ఆయ‌న అనేక రూపాల్లో ప‌రిశ్ర‌మ‌కు హామీ ఇచ్చారు.అయినప్ప‌టికీ.నాగార్జున, చిరంజీవి, బ‌న్నీ.

మ‌హేష్‌బాబు ఇలా అంద‌రూ సైలెంట్ అయిపోయారు.వీరికి ఆయా పార్టీల నుంచి ఆహ్వానాలు అంద‌లేదా? అంటే.అందాయి.టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ స్వ‌యంగా కొంద‌రికి ఫోన్లు చేసి ప్ర‌చారం చేయాల‌ని కోరిన‌ట్టు తెలిసింది.అయినా.ఒక్కరూ స్పందించ‌క‌పోవ‌డంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube