కేసీఆర్ నిర్ణయానికి టాలీవుడ్ స్టార్స్ జేజేలు

కేసీఆర్ ప్రభుత్వంపై టాలీవుడ్‌ ప్రముఖులు సమంత, ప్రకాష్‌ రాజ్‌, రామ్‌, నాని ఇంకా పలువురు ప్రముఖులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.కేసీఆర్‌ తాజాగా కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా రైతులు కొనసాగించిన ఆందోళనలో పాల్గొని మృతి చెందిన వారికి మూడు లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించాడు.

 Tollywood Celebrities Appreciate Telangana Government ,kcr ,ktr, Trs , Tollywoo-TeluguStop.com

చనిపోయిన 750 మందికి ఈ ఎక్స్ గ్రేషియాను ఇవ్వబోతున్నట్లుగా కేసీఆర్‌ ప్రకటించాడు.కేటీఆర్ ఆ విషయాన్ని ట్విట్టర్‌ లో తెలియజేశాడు.

కేటీఆర్ ట్వీట్ కు అనూహ్య రెస్పాన్స్ దక్కింది.పలువురు సినీ ప్రముఖులు ఈ నిర్ణయం పట్ల అభినందనలు తెలియజేశారు.

రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును అంతా కూడా ప్రశంసిస్తున్నారు.ఇది ఖచ్చితంగా రైతులకు మంచి కలిగించే నిర్ణయం అంటున్నారు.

ఉత్తర భారతంకు చెందిన వందల మంది రైతులు ఆందోళన సమయంలో మృతి చెందారు.

ఇటీవల మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లుగా ప్రకటించాడు.

దాంతో రైతులు మెల్ల మెల్లగా తమ ఆందోళన తగ్గిస్తున్నారు.పార్లమెంటులో బిల్లు వచ్చిన తర్వాత మాత్రమే పూర్తిగా వెనక్కు తగ్గుతామని అంటున్నారు.

ఢిల్లీలో కొనసాగిన రైతు ఆందోళనలో పోలీసులు దాడి చేయడంతో పాటు అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు మృతి చెందారు.కనుక వారికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కేంద్రంను కేటీఆర్ డిమాండ్‌ చేస్తున్నాడు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున చనిపోయిన ఒకొక్కరికి మూడు లక్షల పరిహారం ఇవ్వబోతున్నారు.కేంద్రం చనిపోయిన ఒకొక్కరికి పాతిక కోట్ల పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ విషయమై ముందు ముందు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.మొత్తానికి అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.

  కేటీఆర్ ట్వీట్‌ ను చాలా మంది ప్రముఖులు రీ ట్వీట్ చేసి అభినందించారు.కేసీఆర్‌ ప్రభుత్వ తీరు విషయంలో ఆయనకు జే జే లు పలుకుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube