సీసీసీ : వారిని కనిపెట్టడమే ఇప్పుడు పెద్ద టాస్క్‌

కరోనా

నేపథ్యంలో

లాక్‌ డౌన్‌

విధించడంతో సినిమా పరిశ్రమ మొత్తం మూత పడ్డ పరిస్థితి.ఈ సమయంలో సినీ కార్మికులు పలువురు ఆకలితో అలమటిస్తున్నారని, వారికి సాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ టాలీవుడ్‌ ప్రముఖులు పలువురు కోట్లల్లో సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

చిరంజీవి, నాగార్జున

కోటి రూపాయల విరాళంను ప్రకటించిన విషయం తెల్సిందే.చిరంజీవి ఆధ్వర్యంలో

కరోనా క్రైసిస్‌ ఛారిటీ

ని ఏర్పాటు చేశారు.

 Corona Crises Charity Fund Reach The All Cinima Peoples, Tollywood, Ccc, Chiranj-TeluguStop.com

-Movie

ఇప్పటికే ఈ ఛారిటీకి భారీ ఎత్తున నిధులు వచ్చి చేరాయి.ఇప్పుడు సీసీసీకి సినీ కార్మికులను గుర్తించడం పెద్ద సమస్యగా మారింది.తినడానికి తిండి కూడా లేని వారు చాలా మందే ఉన్నారు.ఇప్పుడు వారిని ఎక్కడ గుర్తించాలి, ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు అనే విషయాలను ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు అంటూ ఇండస్ట్రీకి చెందిన వారు అంటున్నారు.

కొందరు అప్పుడే ఈ

ఛారిటీ డబ్బులు

నిజంగా అవసరం ఉన్న వారికి అందేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ ఛారిటీ డబ్బులు అడ్డ దారిలోకి వెళ్లకుండా పెద్దలు చూసుకోవాలంటూ కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.

పేదలను విడిచి పెట్టి అవసరం లేని వారికి ఆర్థిక సాయం అస్సలు చేయవద్దంటూ కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube