మన తెలుగు సినిమా చరిత్ర ఎంతో ఘనమైనది.అదంతా గతం .
పాన్ ఇండియా శకం వచ్చిన తర్వాత భవిష్యత్తుపై ఎన్నో అంచనాలతో చాలామంది సినిమాలు తీస్తున్నారు.ప్రతిగే ఏడు సంక్రాంతి అనగానే సినిమా పండుగ అని అంటుంటారు.2024 సంక్రాంతి 500 కోట్ల రూపాయల కలెక్షన్స్ ఇచ్చింది అద్భుతమైన ఓపెనింగ్స్ అయితే ఇచ్చింది కానీ అప్పటినుంచి అసలు కథ మొదలైంది.సంక్రాంతి పోయిన తర్వాత దాదాపు రెండు నెలపాటు 30 సినిమాలు విడుదలైనా కూడా అందులో ఒక్కటి కూడా మినిమం విజయాన్ని అందుకోలేకపోయాయి.
దాంతో తెలుగు సినిమా నిర్మాతలు( Tollywood Producers ) అంతా కూడా కట్టకట్టుకొని మలయాళ సినిమా పై( Malayalam Movies ) వాలిపోయారు.

ఒక్కసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ డల్ అయిపోతుంది అని తెలియగానే నిర్మాతలు అంతా కూడా చేసే హడావిడి మాములుగా ఉండదు.అప్పుడే పక్క భాషలో హిట్ అవుతున్న సినిమాలపై మన వారి ఫోకస్ మొదలవుతుంది.అక్కడ హిట్ అయిన సినిమాలు డబ్బింగ్ రైట్స్( Dubbing Rights ) కొనుక్కొని వాటిని తెలుగులో రిలీజ్ చేసే పనిలో ఉంటారు.
ఖచ్చితంగా మంచి సినిమాలు వస్తాయి.దాంతో మార్కెట్ ని క్యాష్ చేసుకుంటారు ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకుని దాన్ని కాస్త సొమ్ము చేసుకునే పనిలో ఉంటారు.
ఇటీవల కాలంలో అలాగే చాలా సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాయి.రాజమౌళి తనయుడు కార్తికేయ మలయాళం లో 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన ప్రేమలు( Premalu Movie ) అనే సినిమాని తెలుగులో డబ్ చేయగా మంచి ఓపెనింగ్ రాబడుతున్నాయి.

అలాగే భ్రమయుగం( Bramayugam ) సినిమా సంగతి తెలిసిందే.మమ్ముట్టి నటించిన ఈ సినిమా కూడా అక్కడ 100 కోట్లకు పైగా షేర్ సాధించింది.ఈ సినిమాను సితార వారు డబ్బింగ్ రైట్స్ కొనుక్కొని రిలీజ్ చేశారు.అది కూడా పరవాలేదు తెలుగులో మంచి వసూలు సాధిస్తుంది.ఇక మైత్రి మూవీస్ వారు ఒక అడుగు ముందుకు వేసి ప్రస్తుతం కేరళ లో సంచలనం విజయం అందుకున్న మంజుమెల్ బాయ్స్( Manjummel Boys ) సినిమాని తెలుగులో విడుదల చేయబోతున్నారు.అది మాత్రమే కాకుండా పృథ్వి రాజ్ ఆడు జీవితం( Aadu Jeevitham ) కూడా వీరే డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసారు.







