ఈ టాలీవుడ్ 10 సెలెబ్రిటీలలో అన్నయ్యలు ప్లాప్ కానీ తమ్ముళ్లు సూపర్ హిట్

సినిమా ఇండస్ట్రీలోకి మన వారు ఎవరైనా వచ్చారు అంటే వాళ్లతో పాటు మనం కూడా ఇండస్ట్రీకి వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటాం ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఇష్టం లేని వారు ఉండరు ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ఉండాలని ఉంటుంది కానీ అందరికీ అక్కడ వర్కౌట్ కాకపోవచ్చు కొందరు హీరోలు స్టార్ హీరోగా వెలుగొందుతున్న ఇంకొందరు అసలు హీరోగా పనికి రాకపోవచ్చు అలాగే అందరు హీరోలు గా సక్సెస్ కానప్పుడు వాళ్ల తమ్ముళ్లు స్టార్ హీరోలుగా ఎదిగిపోవచ్చు.అలా ఇండస్ట్రీలో అందరూ అన్నయ్యలు లు సక్సెస్ కాలేక తమ్ముళ్లు స్టార్ హీరోలైన కొంతమంది గురించి చూద్దాం…

 Tollywood Brothers Who Are Hit And Who Are Flop, Ntr, Krishna, Harikrishna, Bala-TeluguStop.com

మొదటగా నందమూరి తారక రామారావు గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు వెలుగొందిన స్టార్ హీరో ఆయన ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించి అందరిని మెప్పించాడు.

ఎన్టీఆర్ కి 8 మంది కొడుకులు, నలుగురు కూతుళ్లు వాళ్లలో ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి హరికృష్ణ ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ మొదట్లో అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ హీరోగా పెద్దగా క్లిక్ కాలేకపోయాడు ఆయన తర్వాత వచ్చిన బాలకృష్ణ అనతికాలంలోనే స్టార్ హీరో అయిపోయాడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.  బాలకృష్ణ అన్నయ్య హరి కృష్ణ కన్నా కూడా సూపర్ హిట్ అని ప్రూవ్ చేసుకున్నాడు.

Telugu Balakrishna, Chirenjeevi, Harikrishna, Krishna, Mahesh Babu, Pawan Kalyan

వీళ్ళ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ తన నట వారసులను పరిచయం చేయడం కోసం రమేష్ బాబు ని హీరోగా పెట్టి కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు రమేష్ బాబు కి యాక్టింగ్ సరిగా రావట్లేదు అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు దీంతో రమేష్ బాబు ఇక సినిమాల్లో చేయను అని నిర్ణయించుకున్నాడు, కృష్ణ కూడా చేసేదేమీలేక వదిలేశాడు.1999లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేష్ బాబుని హీరోగా పరిచయం చేశారు.మహేష్ బాబు అనతికాలంలోనే గొప్ప నటుడు అనిపించుకొని ఒక్కడు సినిమా తో స్టార్ హీరో అయిపోయాడు పోకిరి సినిమా తో మాస్ లో మంచి పట్టు సాధించాడు.దూకుడు లాంటి సినిమాతో కామెడీ టైమింగ్ అదరగొట్టాడు శ్రీమంతుడు లాంటి సినిమాతో క్లాస్ సినిమా లో కూడా తన మాస్ విధానాన్ని మార్చకుండా చూపించాడు.

ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా లో బిజీగా ఉన్నారు.అనిల్ రావిపూడి తో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా తో నిజంగానే సరిలేరు నీకెవ్వరు అని అనిపించుకున్నారు మహేష్ బాబు అన్నయ్య ఫ్లాప్ అయినప్పటికీ మహేష్ బాబు మాత్రం అగ్ర హీరో గా వెలుగొందుతున్నాడు.

Telugu Balakrishna, Chirenjeevi, Harikrishna, Krishna, Mahesh Babu, Pawan Kalyan

హరికృష్ణ కొడుకు లైన నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరిలో కళ్యాణ్ రామ్ సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా హిట్స్ రాకపోవడంతో తను ఒక మీడియం రేంజ్ హీరో గానే మిగిలిపోయాడు కానీ ఎన్టీఆర్ అలా కాకుండా తను చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తోనే తన నటనా ప్రతిభను బయటపెట్టి ఆది సినిమా తో ఒకప్పుడు అగ్ర హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా వసూళ్ల ని బీట్ చేసే కలెక్షన్స్ సాధించాడు.సింహాద్రి సినిమా తో ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిపోయాడు ప్రస్తుతం వరుస హిట్స్ మీదున్న ఎన్టీఆర్ దర్శక ధీరుడు జక్కన్న తో చేస్తున్న త్రిబుల్ ఆర్ సినిమా తో పాన్ఇండియా హీరో అవబోతున్నాడు తమ్ముడు తారక్ సక్సెస్ అయిన అంతగా అన్నయ్య కళ్యాణ్ రామ్ కాలేకపోయాడని చెప్పాలి.

Telugu Balakrishna, Chirenjeevi, Harikrishna, Krishna, Mahesh Babu, Pawan Kalyan

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటే చాలా మంది జనాలు ఇప్పటికీ పూనకాలతో వణికిపోతుంటారు అలాంటి చిరంజీవి హీరోగా వచ్చిన తర్వాత సక్సెస్ ఫుల్ హీరో అయిపోయి మెగాస్టార్ అనే బిరుదు పొందిన తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు హీరో గా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు దీంతో చిరంజీవి చిన్న తమ్ముడైన పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని పవన్ కళ్యాణ్ తో సినిమా చేపించారు.మొదటి సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ ఆ తర్వాత వచ్చిన తొలి ప్రేమ, సుస్వాగతం, బద్రి ,తమ్ముడు, ఖుషి లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు.మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ అనిపించుకున్నాడు.అన్న నాగబాబు సక్సెస్ కాలేకపోయినా అప్పటికి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒక గొప్ప హీరోగా వెలుగొందుతున్నాడు ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తూ వరుసగా ఇంకో 5,6 సినిమాలు లైన్ లో పెట్టాడు.

Telugu Balakrishna, Chirenjeevi, Harikrishna, Krishna, Mahesh Babu, Pawan Kalyan

గొప్ప దర్శకుడు అయిన ఈవీవీ సత్యనారాయణ గారి అబ్బాయిలు అయిన ఆర్యన్ రాజేష్ అల్లరి నరేష్… వీళ్ళల్లో ఆర్యన్ రాజేష్ హాయ్ అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు.వాళ్ళ తమ్ముడు అయిన అల్లరి నరేష్ అల్లరి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత చేసిన తొట్టి గ్యాంగ్, బ్లేడ్ బాబ్జి, బెండు అప్పారావు RMP, సుడిగాడు లాంటి సినిమాలతో మంచి హిట్ కొట్టి ఒక మంచి కామెడీ హీరోగా గుర్తింపు పొందాడు రాజేంద్ర ప్రసాద్ తర్వాత అంత గొప్ప కామెడీహీరో ఎవరు అంటే నరేష్ పేరు చెప్పేంత గా నరేష్ ఎదిగిపోయాడు.ప్రస్తుతం నరేష్ నాంది అనే సినిమాతో డిఫరెంట్ రోల్ చేస్తూ కామెడీనే కాదు ఎమోషనల్ సీన్స్ కూడా బాగా పండించగలను అని నిరూపించడానికి మన ముందుకు వస్తున్నాడు…

Telugu Balakrishna, Chirenjeevi, Harikrishna, Krishna, Mahesh Babu, Pawan Kalyan

మెగాస్టార్ మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ కూడా సినిమాల్లో హిట్స్ కొడుతున్నప్పటికీ డెబ్యూ ఫిల్మ్ గా వచ్చిన పిల్లా నువ్వు లేని జీవితం సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ దాని తర్వాత వచ్చిన రేయ్ సినిమా పెద్దగా ఆడలేదు సాయి ధరమ్ తేజ్ కూడా ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకున్నాడు అయితే వాళ్ళ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ మాత్రం ఉప్పెన అనే ఒక సినిమాతో ఈ మధ్య మన ముందుకు వచ్చి మంచి హీరో అని అనిపించుకున్నాడు.అతని యాక్టింగ్ కూడా బాగుందని చాలా మంది ప్రశంసించారు చాలా తక్కువ టైమ్ లోనే పెద్ద హీరో అయిపోతాడు అని చాలామంది అంటున్నారు ఏదేమైనా సాయి ధరంతేజ్ కంటే వైష్ణవి తేజ్ కి ఫస్ట్ సినిమా సాలిడ్ హిట్ పడిందని చెప్పవచ్చు… ఫ్యూచర్ లో సాయి ధరమ్ తేజ్ కి కూడా పెద్ద హిట్ పడొచ్చు కాని ప్రస్తుతం ఇద్దరికీ వచ్చిన డెబ్యూ సినిమా ప్రకారం సాయి ధరంతేజ్ కంటే వైష్ణవ్ తేజ్ ముందు ఉన్నాడు అనే చెప్పాలి…ఇది ఇండస్ట్రీలో ఉన్న అన్నయ్య కంటే తమ్ముళ్లు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న వాళ్ల స్టోరీ…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube